తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్స్ గా పేరు పొందిన వారిలా అనసూయ, రష్మి పేరు చెప్పగానే ప్రతి ఒక్కరు గుర్తుపట్టేస్తారు. సుమారుగా 12 ఏళ్ల క్రితం మొదలైన జబర్దస్త్ కామెడీ షో ద్వారా వీరిద్దరు యాంకర్లుగా తమ కెరీర్ని ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించేలా ఎదిగారు. కానీ వీరిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు ఉన్నాయనే విషయం గత కొన్నేళ్లుగా వినిపించినప్పటికీ.. ఆధారం లేకపోవడంతో ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయంపై స్వయంగా అనసూయని క్లారిటీ ఇవ్వడం జరిగింది.


రష్మీ ,అనసూయ గత కొన్నేళ్లుగా మాట్లాడుకోలేదని స్వయంగా అనసూయనే చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తాజాగా జబర్దస్త్ కామెడీ షో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక స్పెషల్ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదల చేశారు ఇందులో పాత టీమ్ లీడర్స్ జడ్జిలు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలోనే అనసూయ, రష్మితో ప్యాచ్ అప్స్ గురించి  తెలియజేసింది.జీవితం బోలెడన్ని అవకాశాలు ఇస్తుందని అంటూ ఉంటారు ఖచ్చితంగా ఇస్తుందని నేను నమ్ముతానని తెలియజేసింది అనసూయ.


ఆ సమయంలోనే యాంకర్ రష్మీ దగ్గరికి వెళ్లి అనసూయ ఒక హగ్గు చేసుకుంది. దీంతో వెంటనే రష్మి ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుంది.. ఎవరికి తెలియనివి కొన్ని తెలిసిపోయేలా ఉన్నాయి అంటూ తెలియజేసింది అనసూయ.. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరూ  అసలు మాట్లాడుకోవడం లేదా అంటూ పలువురు నెటిజెన్స్  కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని రష్మి వాట్సాప్ లో లేదా ఫోన్ చేసి మాట్లాడుంటే సరిపోయేది కదా అంటూ చెప్పగా అందుకు అనసూయ ఈగోలు అడ్డు వస్తాయి అలా అయితే అంటూ అనసూయ నవ్వేసింది. అయితే మరి వీరిద్దరి మధ్య గల మనస్పర్ధలకు కారణాలు ఏంటి అనే విషయం మాత్రం తెలియజేయలేదు. కానీ తాజా ప్రోమోలో మాత్రం ఈ విషయాన్ని హైలెట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: