ప్రజెంట్ కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌ఫోన్స్ అన్నిటిలో యూజర్స్ అందరూ యూజ్ చేసే బ్రౌజర్ గూగుల్ క్రోమ్. ఒకప్పుడు అందరూ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ యూజ్ చేసేవారు. అయితే, కాలంతో పాటు యూజర్లకు అనుగుణంగా ఫీచర్స్ అందించడంలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌ప్లోరర్ వెనుకబడింది. ఈ బ్రౌజర్‌కు పోటీగా మొజిల్లా ఫైర్‌ఫాక్స్, గూగుల్ క్రోమ్ అందుబాటులోకి వచ్చాయి. యూజర్స్‌ను అట్రాక్ట్ చేయడంలో, యూజర్స్ ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ అందిచడంలో క్రోమ్ సక్సెస్ అయింది. దాంతో ప్రతీ ఒక్కరు క్రోమ్ యూసేజే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే, ఇటీవల క్రోమ్‌లో లోపం బయటపడగా, ఆ విషయాన్ని గూగుల్ కంపెనీయే తెలిపింది. దాన్ని నివారణా మార్గాలు సూచించింది. అవేంటంటే..

సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం ప్రపంచంలో ఏమూలనో కూర్చోని ఎక్కడి డైటాను అయినా తస్కరిస్తున్నారు. ఇందుకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వేదిక చేసుకుంటున్నారు. సైబర్ నేరస్థుల బారిన పడకుండా ఉండేందుకు గాను గూగుల్ క్రోమ్‌ను యూజర్స్ అప్‌డేట్ చేసుకోవాలి. లేదంటే సైబర్ దొంగలు సెక్యూరిటీ లోపం ద్వారా డివైజ్ నుంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని, డబ్బులు కాజేస్తారు. గూగుల్ ఈ విషయంలో ఎలాంటి భద్రత కల్పించడం గమనార్హం. కాగా,  గూగుల్  యూజర్స్ అలర్ట్‌గా ఉండాలి.

 
ఇప్పటికే కొంతమంది సైబర్ నేరస్థులు చాలా మంది వినియోగదారుల గోప్యమైన సమాచారాన్ని తస్కరించినట్లుగా తెలుస్తోంది. కాబట్టి గూగుల్ క్రోమ్ పాత వర్షన్ వాడే వారందరూ వెంటనే అప్రమత్తం కావాలి. బ్రౌజర్ వర్షన్‌ను అప్‌డేట్  చేసుకోవాలి. ఇందుకు గాను గూగుల్ క్రోమ్ సెట్టింగ్‌లో హెల్ప్, ఏబౌట్ గూగుల్ క్రోమ్ క్లిక్ చేసి మీ క్రోమ్ వెర్షన్ తెలుసుకోవాలి. లేదా గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో సెర్చ్ బార్‌లో  91.0.4472.164 ఐపీ అడ్రస్ టైప్ చేసి ఏ వర్షన్ వాడుతున్నారో తెలుసుకోవచ్చు. ఓల్డ్ వర్షన్‌లోనే వర్క్ చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే అప్‌ డేట్ చేసుకొని మీ డేటా ను జాగ్రతగా కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: