DuoPods F30 ఛార్జింగ్, ఇంకా ప్రత్యేకతలు
Mivi ఇయర్‌బడ్‌లను పూర్తిగా ఛార్జ్ చేసి ఉపయోగిస్తే రెండు రోజుల పాటు అంటే 42 గంటల పాటు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పని చేస్తాయి. ఈ ఇయర్‌బడ్‌లు అద్భుతమైన టచ్ కంట్రోల్ తో వస్తాయి. టచ్ కంట్రోల్ మీ ఫోన్‌ని తాకకుండానే సులభంగా కాల్స్ అటెండ్ చేయడానికి, కట్ చేయడానికి, పాటలను మార్చడానికి, గూగుల్, సిరి వంటి వాయిస్ అసిస్టెంట్‌లను యాక్టివేట్ చేయడానికి, సౌండ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ ఇయర్ ఫోన్ లు దుమ్ము, చెమట, వర్షం లేదా నీటి స్ప్లాష్ వల్ల డామేజ్ అవ్వవు. DuoPods F30 లోని ఇయర్‌బడ్‌కు మైక్రోఫోన్ అమర్చబడి ఉంటుంది. తద్వారా మీరు అదే ఇయర్ బడ్‌ను ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు. 13 మిమీ డ్రైవర్‌లతో కూడిన ఈ ఇయర్‌బడ్స్ బ్లూటూత్ 5.0 కి సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్‌గా ఆన్ మరియు ఆఫ్ చేస్తుంది. ఈ ఇయర్ బడ్‌లను కొనాలనుకుంటే అవి ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ .999 కే అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం కావాలనుకున్న వాళ్ళు ఎంచక్కా ఈ ఇయర్ బడ్స్ కొనేయొచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి