రిలయన్స్ జియో కస్టమర్లను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.. కానీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బంపర్ ఆఫర్అందివ్వడానికి సిద్ధం అయ్యింది. ఇకపోతే జియో యొక్క స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ రూ.2999 లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్ తో అందివ్వడం గమనార్హం.  ఇక ఈ ప్లాన్ గురించి ఇప్పుడు మనం మరికొన్ని విషయాలు చదివి తెలుసుకుందాం.

స్వాతంత్ర్యం దినోత్సవ సందర్భంగా పురస్కరించుకొని రిలయన్స్ జియో ఈ ఆఫర్ ను అందిస్తోంది. ఇక ఈ ప్లాన్ తో వినియోగదారులు 365 రోజులపాటు వ్యాలిడిటీ పొందవచ్చు. ఇక ప్రతిరోజు 2.5GB డేటా చొప్పున పొందే అవకాశం ఉంటుంది. ఇక అంతే కాకుండా అపరిమిత వాయిస్ కాలింగ్ అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందుతారు. రోజువారి డేటా వినియోగం పూర్తయిన వెంటనే వినియోగదారులు 64 కేబిపిఎస్ వేగంతో డేటాను యాక్సిస్ చేయడానికి అనుమతి లభిస్తుంది. అంతేకాదు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ , జియో సెక్యూరిటీతో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ను ఒక సంవత్సరం పాటు పొందవచ్చు.

అంతేకాదు ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు 750 రూపాయల విలువైన 75 జిబి డేటాను ఉచితంగా పొందుతారు. అంతేకాదు రూ.2,250 విలువైన ఇతర ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంటుంది. వీటిలో Ajio ఆన్లైన్ యాప్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.750 డిస్కౌంట్, నెట్ మెడ్స్ రూ.750 అలాగే Ixigo రూ.750 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. ఇక మరెందుకు ఆలస్యం ప్రతినెల రకరకాల రీఛార్జ్ లు చేసుకొని వ్యాలిడిటీ అతి తక్కువ సమయంలోనే పూర్తి కావడం.. డేటా త్వరగా అయిపోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇలా చేస్తే చక్కగా ఏడాది పాటు ఉచితంగా అపరిమిత కాల్స్ తో పాటు ప్రతిరోజు 2.5 జిబి డేటా అలాగే అదనంగా 75 జిబి డేటా కూడా పొందే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: