రైల్వే వ్యవస్థ ముందుకు సాగడంలో పట్టాలదే కీలకపాత్ర అన్న విషయం తెలిసిందే. పట్టాలు సరిగా ఉన్నప్పుడే అటు రైలు ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇటీవల కాలంలో ఎంతోమంది అటు రైల్వే ప్రయాణాలకే ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు. అయితే ఇక మన దేశంలో 67 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ విస్తరించి ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే రైల్వే ట్రాక్లను చూసిన ప్రతిసారి కూడా కొంతమందికి ఒక ప్రశ్న మదిలో మెదులుతూ ఉంటుంది.


 సాధారణంగా రైల్వే ట్రాక్లు వానలో తడుస్తూ ఎండకు ఎండుతూ ఉంటాయి అని చెప్పాలి. కాలంతో సంబంధం లేకుండా అన్ని తట్టుకుంటూ ఉంటాయి. అయితే సాధారణంగా ఇనుము ఇక వర్షంలో తడిసినప్పుడు తుప్పు పట్టడం లాంటివి మనం చూస్తూ ఉంటాం. ఇక ఇలా ఎక్కువ తుప్పుపడితే మాత్రం ఆ ఇనుప వస్తువు దేనికి పనికి రాకుండా పోతూ ఉంటుంది. అయితే రైల్వే ట్రాక్స్ కూడా ఇనుముతోనే తయారు చేస్తారు కదా.. మరి ఎందుకు వర్షంలో తడిసినప్పుడు రైల్వే ట్రాక్ తుప్పు పట్టదు అని అనుమానం ప్రతి ఒక్కరిలో వస్తూ ఉంటుంది.


 అయితే రైల్వే ట్రాక్ చుట్టూ తుప్పు పట్టిన ఇక పైన భాగంలో మాత్రం ఎప్పుడు తుప్పు పట్టదు అని చెప్పాలి. అయితే ఇలా తుప్పు పట్టకపోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉందట. ఇనుముతో తయారైన ఏ వస్తువునైనా గాలిలోని ఆక్సిజన్ తో చర్య జరిపినప్పుడు తుప్పు పట్టడం సర్వసాధారణంగా జరుగుతుంది. రైల్వే ట్రాక్లు తుప్పు పట్టకపోవడానికి వీటిని ప్రత్యేక రకం ఉక్కుతో తయారు చేయడమే కారణం అని చెప్పాలి. దీనిని మాంగనీస్ స్టీల్ అంటారు. ఇందులో 12 శాతం మాంగనీస్ 0.8% కార్బన్ ఉంటుందట. రైల్వే ట్రాక్ నిర్మాణాలు ఈ లోహాలు ఉండటం వల్లే పట్టాల పైన భాగంలో ఐరన్ ఆక్సైడ్ అంటే తుప్పు ఏర్పడదు. ఒకవేళ రైల్వే ట్రాక్లను సాధారణ ఇనుముతో తయారు చేస్తే వర్షం గాలిలోని తేమ కారణంగా తుప్పుపట్టే ఛాన్స్ ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: