ప్రముఖ స్మార్ట్ మొబైల్ తయారీ సంస్థ oppo సంస్థ నుంచి సరికొత్తగా A-38 స్మార్ట్ మొబైల్ ని ఈ వారంలో మొదట uae లో లాంచ్ చేయబడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రోజునే అంటే శుక్రవారం రోజున ఇండియాలో లాంచ్ చేయబడినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ మొబైల్ ఆక్టా కోర్ మీడియా హిలియో చిప్ సెట్ తో పనిచేస్తుందట.అలాగే 33 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 5000 MAH సామర్థ్యం కలిగిన బ్యాటరీని కూడా కలిగి ఉన్నదట. ఈ స్మార్ట్ మొబైల్ రియల్ కెమెరా సిస్టంతో పనిచేస్తుంది.


ఈ మొబైల్ ఇండియన్ మార్కెట్లో ఒక స్టోరేజ్ ఆప్షన్ లో తప్ప మరెక్కడా లభించదు. రెండు కలర్ వేరియంట్ లో కూడా లభిస్తుంది ఈ స్మార్ట్ మొబైల్ ప్రస్తుతం ప్రీ  ఆర్డర్లకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. OPPO A-38 స్మార్ట్ మొబైల్ యొక్క ధర పూర్తి వివరాలు విషయానికి వస్తే.. ఇది బ్లోయింగ్ బ్లాక్, బ్లోయింగ్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుందట.. ఈ మొబైల్ 4GB+128GB స్టోరేజ్ వేరియంట్లు ఇండియాలో ధర విషయానికి వస్తే రూ.12,999 అందుబాటులో కలదు.


అధికారిక వెబ్సైట్ ఒప్పో మరియు ఫ్లిప్కార్ట్ లో మాత్రమే ఫ్రీ ఆర్డర్లు అందుబాటులో ఉన్నాయి సెప్టెంబర్ 13 నుండీ ఈ సెల్ కు రాబోతోంది.. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది నానో సిమ్ సపోర్ట్ తో పనిచేస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే 6.56 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో కలదు.. ఈ మొబైల్ యొక్క కెమెరా విషయానికి వస్తే 50 mp మెగాపిక్సల్ కెమెరాతోపాటు టూ మెగా పిక్సెల్ సెకండరీ కెమెరా కలదు.. సెల్ఫీ కెమెరా 5 మెగా ఫిక్సల్ కలదు.. అలాగే వైఫై బ్లూటూత్ యూఎస్బీ టైప్ సి పోర్టు కూడా కలిగి ఉంటుంది.. ఈ మొబైల్ బరువు 190 గ్రాములు కలదు..

మరింత సమాచారం తెలుసుకోండి: