ప్రస్తుతం ఉన్న రోజులలో దేశవ్యాప్తంగా రోజురోజుకి సైతం ఎలక్ట్రిక్ బైక్స్ డిమాండ్ విపరీతంగా పెరుగుతూనే ఉంది.. వీటికి తోడు మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు కూడా విడుదల అవుతూ ఉన్నాయి.. అద్భుతమైన ఫీచర్స్ తో మార్కెట్లోకి విడుదలవుతూ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఆకర్షిస్తున్నాయి ఎలక్ట్రిక్ బైక్స్..ఇందులో భాగంగా ఇప్పుడు తాజాగా బజాజ్ బ్రాండెడ్ నుంచి చేతక్ -Ev కొత్త ఎడిషన్ ని పరిచయం చేయబోతోంది బజాజ్ బ్రాండెడ్.


తాజాగా 2024 చేతన్ ఎలక్ట్రిక్ బైక్ ని జనవరి 9వ తేదీన లాంచ్ చేయబోతున్నారు. ఈ బైకు సంబంధించి ధర ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త రివైజ్డ్ చేతక్ EV బైక్ అడ్వాన్సుడ్ మెకానిక్స్ వంటి అప్గ్రేడ్ తో ఈ బైక్ రాబోతోంది. టాప్ ఎండ్ చేతన్ బైక్ సరికొత్త వేరియంట్ తో విడుదల చేయబోతున్నారు.. ఈ ఎలక్ట్రిక్ బైక్ పెద్ద బ్యాటరీ అడ్వాన్సుడ్ ఫీచర్స్ తో ఆకట్టుకునే విధంగా లీకైన డాక్యుమెంట్ల ద్వారా రాబోతోంది.. బజాజ్ చేతన్ బైక్ 3.2 Kwh బ్యాటరీ ప్యాక్ తో వస్తోంది..


ఈ ఎలక్ట్రిక్ బైక్ సింగిల్ చార్జింగ్తో 127 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందట.. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న బ్యాటరీ బ్యాకప్ కంటే ఇది అప్గ్రేడ్ వర్షన్ అని చెప్పవచ్చు.. పాత బ్యాటరీలు ఒకసారి చార్జింగ్ చేస్తే 113 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తారు.. అయితే ఈ బజాజ్ కొత్త చేతన్ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. సున్నా నుంచి 100% చార్జింగ్ పూర్తి అవ్వడానికి 4:30 నిమిషాలు మాత్రమే పడుతుందట. గతంలో బైక్స్ టాప్ స్పీడ్  63 kmph.. కానీ ఈ ఎలక్ట్రిక్ బైక్ గంటకు 73 కిలోమీటర్ల వేగంతో ఉంటుందట.ఈ చేతన్ బైక్ సరికొత్త స్క్రీన్ తో కూడా రాబోతోందట. Lcd యూనిట్ ఇన్స్ట్రుమెంట్ తో..TFT స్క్రీన్ ని కలిగి ఉంటుంది.. అలాగే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ,నావిగేషన్, బ్లూటూత్ కనెక్ట్ సరికొత్త ఫీచర్స్ తో ఈ చేతన్ బైక్ రాబోతోంది. అండర్ సీటు కింద 21 లీటర్ల వరకు గ్యాప్ ని పెంచినట్లుగా సమాచారం.. ధర విషయాన్ని ఇంకా తెలియజేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: