ఇండియాలో నెంబర్ వన్ ద్విచక్ర వాహనల సంస్థలలో పేర్పొందింది హీరో స్పెండర్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ అనే ఒక కొత్త మోడల్ బైక్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యింది. ప్రస్తుతం అందుకు సంబంధించి రైడ్ టెస్టింగ్ జరుగుతోందట. త్వరలోనే ఈ బైక్ ను మార్కెట్లోకి కూడా తీసుకురాబోతున్నారు.. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఇంజన్ గేర్ బాక్స్ ను పవర్ఫుల్ లిథియం అయాన్ బ్యాటరీ వంటి బ్యాకప్ తో రీప్లేస్ చేస్తోందట. అలాగే ఇందులో అద్భుతమైన సరికొత్త ఫీచర్స్ ని కూడా చూడవచ్చు..


ముఖ్యంగా నాలుగు గంటలలో పూర్తి చార్జింగ్ అయ్యేలా ఉండడమే కాకుండా 150 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. అలాగే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్పీడ్, బ్యాటరీ పర్సంటేజ్, బైక్ రీడింగ్, టెంపరేచర్, బ్లూటూత్ కనెక్టివిటీ సైడ్ స్టాండ్ సెన్సార్, ఎల్ఈడి హెడ్ లైట్, సేఫ్టీ ఫీచర్స్ డిస్క్ బ్రేక్ ముందు వెనుక వంటి ఫీచర్స్ తో ఉన్నాయి. ఈ హీరో ఎలక్ట్రిక్ బైక్ లో 9kw మిడ్ షిప్ మౌంటెన్ ఎలక్ట్రిక్ మోటర్ ప్యాక్ గా ఉన్నదట..


హీరో ఎలక్ట్రిక్ బైక్ 170 NM టార్కును రిలీజ్ చేస్తుంది.. త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ బైక్ అన్ని మార్కెట్లోకి తీసుకురాబోతోంది.. ఇక ధర గురించి చెప్పాలి అంటే ఎక్స్ షోరూమ్ ధర  రూ.70 వేల రూపాయలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ ఇండియన్ మిడిల్ క్లాస్ ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. అయితే దీని విడుదల తేదీని మాత్రం ఇంకా అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు.. ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ బైక్ హీరో బ్రాండ్ నుంచి సక్సెస్ అయ్యిందంటే సేల్స్ లో ముందు వరుసలో ఉంటుందని కూడా చెప్పవచ్చు ఇంత చౌక ధరకే అతిపెద్ద టూ వీలర్ బ్రాండ్ దొరకడం మంచిది. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: