ఇటీవల కాలం లో టెక్నాలజీ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా పెరిగిపోయిన టెక్నాలజీ మనిషి జీవనశైలిని ఎంతో సులభతరం చేసింది. ఒకప్పుడు ఏ పని చేయాలన్న చెమటోడ్చి కష్టపడేవాడు మనిషి. కానీ ఇప్పుడు ఇక ఏ పని చేయాలన్నా ఒక్క చుక్క చెమట చిందించాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఏకంగా టెక్నాలజీ సహాయంతో ఎంతో సులభంగా అన్ని పనులను పూర్తి చేసేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీకి అనుగుణంగానే తమ జీవనశైలిని కూడా మార్చుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇటీవల కాలంలో టెక్నాలజీ కొంత పుంతలు తొక్కింది. ఏకంగా మనిషి మేధస్సును మించి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ కారణంగా మనిషి మనుగడే ప్రమాదంలో పడిపోయే పరిస్థితి వచ్చింది అన్న విషయం తెలిసిందే. మనిషి చేయాల్సిన అన్ని పనులలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్ ద్వారా పూర్తిచేసేందుకు అవకాశం వచ్చింది. రానున్న రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్ అన్ని రంగాల్లోకి ప్రవేశించడం వల్ల ఎంతో ప్రమాదం వాటిల్లుతుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 అయితే ఇక ఇప్పుడు అటు రక్షణ రంగం లోకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అందుబాటులోకి వచ్చింది అన్నది తెలుస్తోంది. ఎందుకంటే మానవ సహిత విమానానికి, కృత్రిమ మేద ఆధారిత నిర్మాన విమానానికి మధ్య ఇటీవల పరీక్షలు నిర్వహించారు. అమెరికాలో ఈ పరీక్షలు జరిగగా.. ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించింది అక్కడి సైన్యం. అయితే గాల్లో ఇక రెండు విమానాల మధ్య పోటీ నడిచిందని.. ఏఐ అద్భుతంగా విమానాన్ని నడిపింది అని అటు అమెరికా సైన్యం తెలిపింది. అయితే ఆ పోటీలో మనిషి గెలిచాడా లేకపోతే ఏఐ గెలిచిందా అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ విషయం కాస్త ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: