ప్రస్తుతం ఉన్న రోజులలో కరెంటు లేకపోతే ఏ పని కూడా చేయలేని పరిస్థితులలో ఉన్నాము.. ప్రతి ఒక్కరి ఆఫీసులలో, కొంతమంది ఇళ్లలో  కచ్చితంగా ఇన్వర్టర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇన్వర్టర్ లను సరిగ్గా మెయింటైన్ చేయకపోతే బ్యాకప్ క్రమంగా తగ్గిపోతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా బ్యాటరీలో ఎప్పుడు నీళ్లను పోయాలో చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే ఖచ్చితంగా రెండుసార్లు అయినా బ్యాటరీని తనిఖీ చేస్తూ ఉండాలి. ఇన్వర్టర్ ఉన్న వారి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలను కూడా చూద్దాం.


ఇన్వర్టర్ బ్యాటరీలు నీటిని మార్చుతూ ఉంటాయి అందుకే దాని స్థాయి తగ్గుతూ ఉంటుందట.. తక్కువగా ఉన్నప్పుడు మనం డిస్టిల్డ్ వాటర్ ని అందులోకి పోస్తాము. డిస్టిల్డ్ వాటర్ లేకపోతే బ్యాటరీ ఎండిపోవడం జరుగుతుంది. దీనివల్ల బ్యాటరీ పనితీరు కూడా తగ్గిపోతుంది. ఇన్వర్టర్ ని ఎక్కువసేపు ఉపయోగించేవారు ప్రతి 40 నుంచి 50 రోజులకు తనిఖీ చేస్తూ ఉండాలి. ఇన్వర్టర్ బ్యాటరీలకు కనిష్ట ,గరిష్ట వంటి గుర్తులను కలిగి ఉంటుంది. డిస్టిల్డ్  వాటర్ మట్టం కనిష్ట స్థాయి కంటే తక్కువగా ఉంటే అందులోకి డిస్టిల్డ్ వాటర్ నింపాల్సిన సమయమని గుర్తుంచుకోవాలి.


నీటి మట్టం ఎక్కువ లేదా తక్కువగా ఉండకూడదు. కచ్చితంగా లైన్ మార్క్ చూపించిన ప్రాంతంలోనే ఉంచాలి. డిస్టిల్డ్ వాటర్ ని ఎక్కువగా నింపితే బ్యాటరీ నీరు నుంచి పొంగిపోయి దెబ్బ తినేలా చేస్తుంది. దీనివల్ల బ్యాటరీ పాడవుతుంది. ఎప్పుడూ కూడా డిస్టిల్డ్ వాటర్ ని ఉపయోగించాలి సాధారణ నీటిని ఉపయోగిస్తే బ్యాటరీ దెబ్బతింటుంది. బ్యాటరీ కవర్ ను అనవసరంగా తీయకూడదు. మనం బ్యాటరీని తనిఖీ చేస్తున్న సమయంలో కచ్చితంగా బ్లౌజులను ,అద్దాలను ధరించడం ముఖ్యము.. పవర్ ఉన్నప్పుడు ఎవరూ కూడా ఇన్వర్టర్ ను ముట్టుకోకూడదు. తరచూ ఎక్కువగా వేడి అవుతూ ఉంటే వెంటనే మెకానిక్ ను సంప్రదించి అందుకు సంబంధించిన తనిఖీలను చేయించాలి. నాణ్యమైన ఇన్వర్టర్ లనే కొనడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: