మెగా ఫ్యామిలిలో పెళ్లి సంబరాలు అంభరాన్ని అంటుతున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు కూతురు మెగా ప్రిన్సెస్ నిహారిక వివాహం ఘనంగా జరుగుతుంది.మెగా ఫ్యామిలీ అంతా చేసే  సంబరాలతో పెళ్లి సందడి పీక్స్‌కు చేరింది. మరికొద్ది గంటల్లో నిహారిక పెళ్లి పీటలు ఎక్కబోతోంది. జొన్నలగడ్డ చైతన్యతో ఆమె వివాహం జరగబోతోంది.

 ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్ హోటల్ వీరి వివాహానికి వేదిక కానుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా కూడా అక్కడకు చేరుకుంది. ఇప్పటికే సంగీత్ లో డాన్స్ లతో ఇరగడిసింది మెగా ఫ్యామిలీ.అయితే ఇప్పుడు నిహారిక బాబాయి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెళ్ళికి హాజరు అవుతుండడంతో పెళ్ళికి మరింత కళ రానుంది.రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కాస్త విరామం తీసుకుని పెళ్ళికి హాజరు అవుతున్నాడు.నిహారిక పెళ్లి వేడుకలో మెగా హీరోలంతా సందడి చేస్తున్నారు.

రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ కూడా సంగీత్ కార్యక్రమంలో చిందులేశారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం కాస్త ఆలస్యంగా జాయిన్ అవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పవన్ ఉదయ్‌పూర్ బయల్దేరారు.మరి బాబాయి రాకతో పెళ్లి సంబరాలు మరింత ఘనంగా జరగడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: