డిగ్రీ పూర్తీ చేసిన తర్వాత చాలామంది ఉద్యోగాలు చెయ్యాలని ఆలోచనలో ఉంటారు.మరి కొంతమంది ఏదైనా బిజినెస్ చెయ్యాలని అనుకుంటారు..అలాంటి వాళ్ళు కష్టపడి చివరికి సాధిస్తారు.మన స్థాయికి, సామర్ధ్యానికి మించినది కావడంతో.. లక్ష్యాన్ని సాధించకుండానే వ్యాపారస్తులుగా మారాలనుకునే అనేకమంది చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కాలం గడిపేస్తారు. కాని కొంతమంది మాత్రం తమ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో ప్లాన్ చేసుకుంటారు. ఆకాశానికి నిచ్చెన వేయకుండా తమ సామర్థ్యాన్ని, స్థాయిని బట్టి లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న వారు తప్పకుండా విజయం సాధిస్తారు. సరిగ్గా ఓ యువకుడికి సంబంధించిన ఇలాంటి ఓ స్ఫూర్తిదాయక సంఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాను ఆహార రంగానికి సంబంధించిన వ్యాపారం చేయాలనుకున్నాడు.


 అది చిన్నదా పెద్దదా అని ఆలోచించలేదు. తనకు అందుబాటులో ఉన్న వనరులతో ఓ చిరు వ్యాపారాన్ని ప్రారంభించాడు. తన ఆలోచనను ఏ విధంగా ఆచరణలో పెట్టాడో వివరిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ ఫుడ్ బ్లాగర్ సంస్థ.బికామ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఓ యువకుడు తన జీవనోపాధి కోసం సౌత్ ఇండియన్ ఫుడ్ స్టాల్‌ను ఏర్పాటు చేశాడు. హర్యానాలోని ఫరీదాబాద్ కు చెందిన అవినాష్ 2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత మెక్‌డొనాల్డ్ సంస్థలో మూడేళ్లపాటు పనిచేశాడు. అయితే సొంతంగా వ్యాపారం చేయాలనేది అతని లక్ష్యం. నిధుల కొరత కారణంగా ఆ లక్ష్యాన్ని మొదట్లో సాకారం చేసుకోలేకపోయాడు. దీంతో ఉద్యోగంలో చేరారు.


అయితే, ఆతర్వాత బైక్ పై కూడా ఫుడ్ బిజినెస్ చేయవచ్చని తెలుసుకుని.. తక్కువ పెట్టుబడితో చేయగల వ్యాపారం కోసం ఆలోచించాడు. అదే సమయంలో తాను చేయగలనో లేదో, తన దగ్గర ఉన్న వనరులను చూసుకున్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. సమయాన్ని వృథా చేయకుండా ఉద్యోగానికి స్వస్తి చెప్పి బైక్ పై ఇడ్లీ-సాంభార్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. దేశంలో చాలా మంది సౌత్ ఇండియా ఫుడ్ ను ఇష్టపడుతుంటారు. అందులోనూ ఇడ్డీ-సాంబార్ అంటే లొట్టలేసుకుని లాంగిచేస్తారు. ఫరీదాబాద్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోది కావడంతో చాలా మంది దక్షిణ భారత దేశానికి సంబంధించిన వారు ఉద్యోగం, ఉపాధి కోసం అక్కడ నివాసముంటూ ఉంటారు. నార్త్ ఇండియాలో సౌత్ ఇండియా ఫుడ్ ప్రత్యేకంగా అల్ఫాహరానికి సంబంధించిన వెరైటీలు తక్కువుగా దొరుకుతుంటాయి. ఇడ్టీ- సాంబార్ దుకాణాన్ని బైక్ పై ప్రారంభించాడు..తన భార్య కూడా తనకు మద్దతుగా ఉంటుంది.. మొత్తానికి తన రుచి తో అందరినీ మెప్పించాడు..బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు..ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: