సాధారణంగా లక్షల మంది ప్రతిరోజూ రైలు ప్రయాణాలను సాగిస్తూ ఉంటారు. కొంతమందికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నట్లుగానే కొన్ని ప్రాంతాల వారికి కేవలం రైలు సదుపాయాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.  ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలన్నా కూడా ఇక రైలులో ప్రయాణించాల్సి ఉంటుంది అని చెప్పాలి. ఇలా ఎంతో మంది జీవితాల్లో నేటి రోజుల్లో రైలు ప్రయాణం అనేది ఒక భాగంగా మారిపోయింది. అయితే ఇలా రైలులో ప్రయాణించే ప్రయాణికులకు రైలులో ఎలాంటి సదుపాయాలు ఉంటాయన్న విషయంపై క్లారిటీ ఉంటుంది. కానీ ట్రైన్ లో ఫ్రీ షవర్ ఏర్పాటు చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా.


 ట్రైన్లో ఫ్రీ శవర్ ఏర్పాటు చేయడమేంటి ఇదేదో విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా. కానీ ఇక్కడ మాత్రం ఇదే జరిగింది. ప్రయాణికులు వద్దన్నా కూడా ఫ్రీ షవర్  వారిని తడిపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్లో తీగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. పశ్చిమబెంగాల్లో చోటు చేసుకున్న ఈ ఘటన కాస్తా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఈ వీడియోలో కుళాయి దగ్గర ముందు నీటిని కంట్రోల్ చేసే టాప్ పగిలిపోవడంతో నీరు ఫిరంగిలాగా ముందుకు రావడం మొదలైంది. కొద్దిసేపటికి ఇక ఆ నీరు పడుతున్న చోటుకి ఒక రైలు వచ్చి ఆగింది. ఈ క్రమంలోనే ఇక ఆ నీరు మొత్తం రైలు కిటికీ దగ్గర డోర్ దగ్గర నిలబడి కూర్చొని ఉన్న ప్రయాణికులు అందరిని కూడా తడిపేసింది అని చెప్పాలి.


 ఇక ఈ వీడియో వైరల్ గా మారిపోవడంతో నెటిజన్లు అందరూ కూడా భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. పాపం కులాయికి కోపం వచ్చినట్టుంది. అందుకే ఆ కోపం ప్రయాణికులపై  చూపించింది అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే.. రైల్లో ఫ్రీ షవర్ అంటే ఇదేనేమో అంటూ మరి కొంతమంది సెటైర్లు పేలుస్తూ ఉండడం గమనార్హం. ఇలా అయితే ఉదయాన్నే స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: