పార్లమెంటులో సభ్యురాలుగా ఉన్న ఒక మహిళ ఎంపీపై మరో ఎంపీ చేయి చేసుకున్నాడు. అంతేకాదు దారుణంగా దాడి చేశాడు. చేయితో కొట్టడమే కాదు కాలితో దారుణంగా దాడి చేసి కడుపులో తన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఆఫ్రికాలోని సెగనల్ దేశంలో ఈ ఘటన వెలుగు చూస్తుంది. ఏకంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అధికారిక కూటమి చెందిన మహిళ చట్ట సభ్యురాలు అమీ డేయి గ్నీబి పై ప్రతిపక్ష ఎంపీ మస్సాట సాంబ్ చేయి చేసుకున్నాడు ఆ తర్వాత అతని నిలవరించేందుకు మహిళా ఎంపీ వెళ్ళిన సమయంలో కాలితో దారుణంగా పొత్తికడుపులో తన్నాడు.
అయితే అక్కడ ఉన్న మిగతా పార్లమెంట్ సభ్యులు అతని ఆపేందుకు ఎంతలా ప్రయత్నించినప్పటికీ అతను మాత్రం రెచ్చిపోయి దాడి చేశాడు అని చెప్పాలి. అధ్యక్షుడు మాకి సాల్ మూడోసారి ఎన్నికను గ్నీబి వ్యతిరేకించారు. మరోవైపు సాంబ్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టిన క్రమంలో ఆయన ఆమె వద్దకు వచ్చి దాడి చేసినట్లుతెలుస్తుంది. ఈ ఘటన కాస్త సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటనతో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది చూసి ఎంతో మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటులో వీధి రౌడీల్లా కొట్టుకున్నారేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.