సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో విపక్ష పార్టీలు అటు అధికార పార్టీలపై ఎన్నో ప్రశ్నోత్తరాలు సంధించడం జరుగుతూ ఉంటుంది. ఇక కొన్ని కొన్ని సార్లు ఇక ఇలాంటి వాదన జరుగుతున్న సమయంలో ఒకరిపై ఒకరు కాస్త దురుసు వ్యాఖ్యలు చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటామూ. కానీ ఎక్కువ సమయాల్లో మాత్రం పార్లమెంటు సభ్యులు ఎంతో హుందా గానే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఏకంగా పార్లమెంటు లో తోపుస్తలాట జరగడం లాంటిది మాత్రం ఎప్పుడు ఉండదు అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనూహ్య  ఘటన జరిగింది.


 పార్లమెంటులో సభ్యురాలుగా ఉన్న ఒక మహిళ ఎంపీపై మరో ఎంపీ చేయి చేసుకున్నాడు. అంతేకాదు దారుణంగా దాడి చేశాడు. చేయితో కొట్టడమే కాదు కాలితో దారుణంగా దాడి చేసి కడుపులో తన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఆఫ్రికాలోని సెగనల్ దేశంలో ఈ ఘటన వెలుగు చూస్తుంది. ఏకంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అధికారిక కూటమి చెందిన మహిళ చట్ట సభ్యురాలు అమీ డేయి గ్నీబి పై ప్రతిపక్ష ఎంపీ మస్సాట సాంబ్ చేయి చేసుకున్నాడు  ఆ తర్వాత అతని నిలవరించేందుకు మహిళా ఎంపీ వెళ్ళిన సమయంలో కాలితో దారుణంగా పొత్తికడుపులో తన్నాడు.


 అయితే అక్కడ ఉన్న మిగతా పార్లమెంట్ సభ్యులు  అతని ఆపేందుకు ఎంతలా ప్రయత్నించినప్పటికీ అతను మాత్రం రెచ్చిపోయి దాడి చేశాడు అని చెప్పాలి.  అధ్యక్షుడు మాకి సాల్ మూడోసారి ఎన్నికను గ్నీబి వ్యతిరేకించారు. మరోవైపు సాంబ్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టిన క్రమంలో ఆయన ఆమె వద్దకు వచ్చి దాడి చేసినట్లుతెలుస్తుంది. ఈ ఘటన కాస్త సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటనతో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది చూసి ఎంతో మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటులో వీధి రౌడీల్లా కొట్టుకున్నారేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: