గత రెండున్నర సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్నది కరోనా వైరస్.. దీనివల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులు కూడా పడవలసి వచ్చింది.. మరికొంత మంది ప్రజలు తమ కుటుంబ సభ్యులను కూడా కోల్పోవడం జరిగింది ఈ వైరస్ వల్ల.. ఇక ఎంతో మంది దేశంలో అనాధలుగా కూడా మిగిలారు.. అయితే ఇక కరోనా సోకింది లేదా అనే విషయంపై.. వాటి ఫలితాల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూడవలసి వస్తూ ఉండేది.. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిన్న పరికరం తో కేవలం 5 నిమిషాల్లోనే కరోనా సోకింది లేదని నిర్ధారణ చేసుకోవచ్చట వాటి గురించి చూద్దాం.


దీని పేరు కరోనా బ్రీత్ అనలైజర్ అనే పేరున నామకరణం చేశారు. జస్ట్ గాలి ఊదితే చాలు.. ఫలితం ఐదు నిమిషాల లోపల తెలుస్తుందట. ఇక ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించిన.. వెంటనే పరీక్ష చేయించుకోవాల్సి వస్తోంది. లేదంటే మనకి కరోనా సోకిన లేదా అన్న అనుమానం పట్టిపీడిస్తోంది జనాల్ని. కరోనా పరీక్షలు చేయించుకోవాలి అంటే అదొక పెద్ద తతంగం గా మారింది. టెస్ట్ కోసం స్వాప్ శాంపిల్స్ ను కూడా ఇవ్వాలి. ఫలితం కోసం కనీసం పన్నెండు గంటలు అయిన వెయిట్ చేయాలి. అప్పటివరకు మనకి కారోన పాజిటివ్ వస్తుందా.. లేక నెగటివ్ వస్తుందన్న  సందేహం ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేస్తూ ఉంటుంది.


ఇక ఇలాంటి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని శాస్త్రవేత్తలు.. కొత్త విధానాన్ని కనిపెట్టడం జరిగింది. కేవలం శ్వాస ద్వారా కరోనా సోకింది లేదో తెలియజేసే పరికరం ను అందుబాటులోకి తీసుకువచ్చారు నిపుణులు.. అయితే ఇది మన ఇండియాలో మాత్రం కాదు.. ఈ టెక్నాలజీని ఇజ్రాయిల్ ప్రాంతం వారు కనిపెట్టారు. ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ పరికరంతో 5 నిమిషాల లోపు కనిపెట్టవచ్చు కరోనని.. అది కూడా చాలా ఖచ్చితమైన ఫలితం ఇస్తుందట. కేవల చీప్ మీద గాలి ఊది.. ఆ చెప్పు ను తీసుకు వెళ్లి ఆ యంత్రం ముందర ఉంచితే చాలు ఫలితాన్ని తెలియజేస్తుందట.. త్వరలోనే ఇలాంటి పరికరం అందరికీ అందుబాటులో తెస్తామని శాస్త్రవేత్తలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: