ప్రకృతి ఎంతో అందమైనది. అందుకే ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు అది అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ప్రకృతి స్వచ్ఛమైన ఆనందాన్ని పంచుతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు. కొన్ని కొన్ని సార్లు ప్రకృతి అందాలను చూసి మైమరచిపోతు ఉంటారు. ఈ క్రమంలోనే ప్రకృతి అందాలను చూపించి అందరిని ఆశ్చర్యపోయేలా చేసే ఎన్నో వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇలా సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఎక్కడో మారుమూల జరిగిన సంఘటనలు కూడా ఉన్నారు అందరూ తెలుసుకోగలుగుతున్నారు.


 ఇక్కడ ప్రకృతి అందాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది. కన్యాకుమారి సమీపంలో సముద్రం వీటిని మేఘాలు పీల్చుతూన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారిపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వర్షాన్ని కురిపించే మేఘాలు సముద్రపు నీటిని పీల్చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తూ ఉన్నాయి.  దీంతో ఇక ఇది చూసిన వారు వావ్ అని అనకుండా ఉండలేకపోతున్నారూ అనే చెప్పాలి. బీచ్ లో ఉన్న కొంతమంది ఇక ఇదంతా సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.  కన్యాకుమారి సమీపంలో ఇలా సముద్రపు నీటిని మేఘాలు పీల్చుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.


 కన్యాకుమారి జిల్లాలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు జిల్లాలో అక్కడక్కడ జల్లులు పడుతూ ఉన్నాయి. కాగా కన్యాకుమారి సమీపంలో ఉన్న తూతూరు లో సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా కనిపించింది.  దీంతో ఇక అక్కడే ఉన్న జాలర్లు సముద్రంలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో దాదాపు 30 నిమిషాలపాటు మేఘాలు సముద్రపు నీటిని పీల్చుకున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతోంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: