మనం సంతోషంగా ఉంటే చాలు ఎవరు ఎటు పోతే మాకేంటి అనుకునే రోజులు ఇవి. ఒకరి ప్రాణం పోతున్నా కనీసం సహాయం చేయడానికి ముందు అడుగు వేయలేని పరిస్థితి నేటి రోజుల్లో నెలకొంది. కరోనా వైరస్ వచ్చిన తర్వాత  ప్రమాదంలో ఉన్న మనిషిని ముట్టుకోవడానికి కూడా భయపడి పోతున్నారు ఎంతో మంది. ఇలాంటి సమయంలో కూడా మనుషుల్లో ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు తెరమీదికి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 సాధారణంగా వర్షం పడింది అంటే చాలు రోడ్లపై నీరు నిలిచి పోవడం జరుగుతుంటుంది. ఇక ఇలా రోడ్లపై నీరు నిలిచి పోయిన సమయంలో కొన్ని కొన్ని విద్యుత్ స్తంభాలు దగ్గర కరెంట్ షాక్ తగలడంతో జరుగుతూ ఉంటుంది. అందుకే వర్షం పడినప్పుడు విద్యుత్ స్తంభాలు నుంచి కాస్త దూరంగా ఉండాలని ఎప్పటికప్పుడు అధికారులు హెచ్చరిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే మనిషి అయితే ఇలాంటివి అర్థం చేసుకుంటాడు. కానీ మూగజీవాలకు ఏం అర్థమవుతుంది. ఇక ఇటీవలే వర్షం పడటంతో రోడ్డు మొత్తం నీళ్ళు నిండిపోయాయి. వాహనదారులు అలాగే అటు ఇటు తిరుగుతున్నారు. అంతలో అక్కడికి ఒక ఆవు చేరుకుంది. విద్యుత్ స్తంభం దగ్గరికి రాగానే ఆవుకు కరెంట్ షాక్ తగిలింది. దీంతో ఒక్కసారిగా విలవిలలాడి పోయింది.


 ఈ క్రమంలోనే పక్కనే ఉన్న ఒక దుకాణదారుడు ఆవు కరెంట్ షాక్ తో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది అన్నది అర్థం చేసుకున్నాడు. దీంతో ఎంతో రిస్క్ చేసి ఆవు ప్రాణాలను కాపాడాడు. తన వెంట తీసుకు వెళ్ళిన ఒక చిన్న గుడ్డ తో నీళ్ళలోకి దిగి ఆవు కాళ్ళని పట్టుకుని వెనక్కి లాగడం మొదలు పెట్టాడు. గమనించిన మరో ఇద్దరు యువకులు సైతం అతనికి సహాయం చేశారు. దీంతో ఆవు కరెంట్ షాక్ నుంచి ప్రాణాలతో బయట పడింది అని చెప్పాలి. అయితే ఏమాత్రం పొరపాటు జరిగినా సదరు యువకుడు ప్రాణాలు కూడా పోతాయి అని తెలిసినప్పటికీ.. రిస్క్ చేసి ఆవు ప్రాణాలు కాపాడిన సదరు యువకుడిపై ప్రస్తుతం నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన పంజాబ్ లో జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: