సాధారణంగా సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు తెరమీదికి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే . ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమకు నచ్చిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండడంతో ఇక ఇలాంటి వీడియోలు వైరల్ గా మారిపోతున్నాయి. ఇలా వైరల్ గా మారిపోయిన వీడియో లలో కొన్ని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అసలు ఇలా ఎలా సాధ్యమైంది అని ఆ వీడియోలో చూసి ఎంతో మంది ఆలోచనలో పడిపోతుంటారు. మరి కొన్ని వీడియోలు అందరిని భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే.


 ఇక ఎప్పటి లాగానే ఇప్పుడు కూడా ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ కళ్ళను మీరే నమ్మలేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ వీడియో అంత గమ్మత్తుగా ఆశ్చర్యకరంగా ఉంది. ఈ వీడియోలో జరుగుతున్నది నిజమా లేక పోతే అబద్దమా అన్నది తెలియక అయోమయంలో పడిపోతున్నారు ప్రతి ఒక్కరు. సాధారణంగా నీటిపై నిలబడటం దాదాపు ఎవరికీ సాధ్యం కాదు. నీటిలో నిలబడాలని ప్రయత్నిస్తే చివరికి నిండా మునిగి పోవడం తప్ప ఇంకేం ఉపయోగం ఉండదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం నీటిలో పరిగెడుతూ చేపలు పట్టడాన్ని మనం చూడవచ్చు.


 అంతే కాదు ఎంతో వేగంగా నీటిలో దూసుకు పోతున్నాడు సదరు వ్యక్తి. దీంతో అతను ఇలా ఎలా చేయగలిగాడు అని ఇది చూసిన నెటిజన్లు అందరూ కూడా ఆలోచనలో పడిపోయారు. ఇది నిజమేనా కాదా అని అయోమయానికి గురవుతున్నారు అని చెప్పాలి. హాయిగా సిగరెట్ తాగుతూ నీటిపై నడుస్తూ చేపలు పడుతున్న సదరు వ్యక్తిని చూసి అవాక్కవుతున్నారు. కొంతమంది ఇది కేవలం గ్రాఫిక్స్ మాత్రమే అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. మరింకెందుకు ఆలస్యం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: