ఇంకొంత మంది సరీస్రూపాలను కూడా పెంచుకుంటూ ఏకంగా అందర్నీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఎలాంటి జంతువులను పెంచుకున్న సరే అవి సాధారణంగా ఎలాంటి ఆహారాన్ని అయితే తీసుకుంటాయో అలాంటి ఆహారాన్ని పెట్టాల్సి ఉంటుంది. లేదంటే అవి అనారోగ్యం బారిన పడి చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇలా పెంపుడు జంతువులు మనుషుల్లాగా చిరుతిండ్లు తినవు అని అంటూ ఉంటారు అందరూ. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఏకంగా ఒక రాక్షస బల్లి చిరుతిండి తినడానికి అలవాటు పడింది. తన యజమానితో కలిసి హాయిగా ఒక పుచ్చ పండును ఆరగిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది.
ఇగువాన అనే రాక్షస బల్లితో ఒక వ్యక్తి ఏకంగా పుచ్చకాయను పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా ఇది చూసినట్లు అందరూ షాక్ అవుతున్నారు. ఇలాంటి ఒక ప్రమాదకరమైన జంతువును ఇంట్లో ఉంచడం మంచిదేనా అని కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి ప్రమాదకరమైన జంతువుతో ఆహారాన్ని పంచుకోవడం సరైన పద్ధతేనా అని ఇంకొంతమంది అడుగుతున్నారు. ఇంకొంతమంది అయితే కుక్కలు, పిల్లులను వదిలేసి ఎందుకు ఇలాంటి జంతువులు పెంచుకోవడానికి అతడు ఆసక్తి చూపాడు అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి