ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని మనిషి ఊహించుకోవడానికి కూడా భయపడుతూ ఉన్నాడు. ఎన్ని పనులు ఉన్నా సరే కొంత సమయాన్ని కేటాయించి మరి మొబైల్ ని వినియోగిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో స్మార్ట్ఫోన్ లోనే ప్రపంచాన్ని చుట్టేయగలుగుతున్నాడు ప్రతి మనిషి. ఇక సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసి షాక్ అవుతున్నాడు అని చెప్పాలి.



 అయితే ఇలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు కొన్ని కొన్ని సార్లు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి. మరికొన్నిసార్లు నివ్వెర పోయేలా చేస్తూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు కడుపుబ్బ నవ్వుకునేలా ఘటనలు ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో కూడా అందరిని కడుపు అని నవ్వుకునేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. ఏకంగా ఒక షాప్ స్పెల్లింగ్ ని ఒక మహిళ చదివినా విధానం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలు ఏముందంటే..



 ఒక వ్యక్తి ఎదురుగా ఉన్న షాప్ బోర్డుపై ఏం రాసి ఉందొ చెప్పాలి అంటూ ఒక మహిళను అడిగాడు. అయితే తనకు ఏదో పెద్దగా ఇంగ్లీషు వచ్చేసినట్లు ఎక్కడా తడబడకుండా ఆ మహిళ ఒక పేరు చెప్పింది. ఆ పేరు వినగానే అతడు పగలబడి నవ్వుకున్నాడు అని చెప్పాలి. ఇంతకీ ఆ మహిళ చెప్పిన పేరు ఏంటో తెలుసా.. ఆంటీ కి ఇండియా. కానీ ఆ బోర్డుపై రాసుంది మాత్రం ఆంటీక్ ఇండియా. దీంతో ఒక్కసారిగా నవ్వుకున్న సదరు వ్యక్తి అక్కడ రాసింది ఆంటీ కి ఇండియా కాదు ఆంటీక్ ఇండియా అని చెప్పడంతో మహిళ తన తప్పును గ్రహించింది. దీంతో తనలో తాను నవ్వుకుంది. ఈ వీడియో చూసి నేటిజన్స్ కూడా తెగ నవ్వేసుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: