అడవుల్లో ఉండే అత్యంత క్రూరమైన జంతువులు ఏవి అంటే పులి సింహం చిరుత అని పేరు చెబుతూ ఉంటారు. అయితే వీటి పేరు చెబితేనే ఎందుకో తెలియకుండానే వెన్నులో కాస్త భయం పుడుతూ ఉంటుంది. అయితే ఇక ఇలాంటి జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో చాలానే ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇక ఇటీవల కాలం లో అందరికీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. పులులు సింహాలు లాంటి క్రూర జంతువులు ఎలా వేటాడుతాయి అన్న విషయాన్ని ఆ వీడియోలతో తెలుసుకో గలుగుతున్నారు జనాలు.


 అంతేకాదు అత్యంత క్రూరంగా వేటాడే తీరు చూసి ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇలాంటి క్రూరమైన జంతువులను వీడియోలు చూస్తేనే భయమేస్తుంది అంటే ఇక నేరుగా కళ్ళముందు ప్రత్యక్షమైతే ప్రాణాలు అటు నుంచి అటే గాల్లో కలిసిపోతాయి. అయితే ఇక్కడ ఒక వ్యక్తికి ఇలాంటి అనుభవం ఎదురయింది. అతను హాయిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ అంతలోనే ఒక పెద్ద పులి అతనికి ఎదురుపడింది. దీంతో ఇక అతను ప్రాణాల మీద ఆశలు కూడా వదిలేసుకున్నాడు. కానీ అదృష్టవశాత్తు ఆ పులి అతన్ని ఏమీ అనకుండా దాని దారిన అది వెళ్లిపోయింది.


 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. తొలుత ఒక వ్యక్తి రహదారి గుండా హాయిగా నడుచుకుంటూ వెళుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా ఒక పులి అతని ముందు నుంచి వేగంగా పరుగులు తీస్తూ వెళ్తుంది. దీంతో అతను ఒక్కసారిగా హడలిపోయాడు. అయితే అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ.. పులి దాని దారిన అది వెళ్లడంతో కాస్త ధైర్యం తెచ్చుకుని అక్కడ నిలబడిపోయాడు అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: