అయితే ఇలా భారీ ఎద్దును లేదా దున్నపోతును కొమ్ములు పట్టుకుని నియంత్రించి కిందికి పడేయడం రియల్ లైఫ్ లో సాధ్యమవుతుందా అంటే.. రియల్ లైఫ్ లో బళ్లాల దేవుడు లాంటి మనుషులు ఎవరున్నారు చెప్పండి. అలా ఎవరైనా చేయాలని ప్రయత్నించారో చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్లే అవుతుంది అని ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెబుతారు. కానీ బాహుబలి లో బల్లాల దేవుడిని మించిపోయేలా ఇక్కడ ఒక వ్యక్తి రియల్ లైఫ్ లో కూడా ఇలాంటిదే చేసి చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అచ్చం బాహుబలి సినిమా తరహాలోనే ఎద్దు కొమ్ములను పట్టుకుని బలవంతంగా అటు ఇటు తిప్పుతూ ఇక బలం మొత్తం ప్రయోగించి ఎద్దును నేలపై పడగొట్టగలిగాడు ఇక్కడ ఒక వ్యక్తి.
అయితే ఇతని నిర్వాకం చూసి అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి వాహనాలు అటు ఇటు తిరుగుతూ రద్దీగా ఉన్న ఒక రోడ్డుపై ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అంతలోనే అక్కడికి ఒక భారీ ఆకారం ఉన్న ఎద్దు వచ్చింది. కొమ్ములతో అతని పైకి దూసుకు రావడంతో అతను కొమ్ములను పట్టుకుని అటూ ఇటూ తిప్పి ఏకంగా ఆ ఎద్దుని కింద పడగొట్టగలిగాడు. దీంతో ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడు అనేది తెలుస్తుంది. దీంతో 90 వేస్తే ఇలాగే ఉంటుంది అంటూ ఎంతో మంది సోషల్ మీడియా జనాలు కామెంట్లు చేస్తున్నారు. ఎద్దు సైలెంట్ గా ఉంది కాబట్టి సరిపోయింది దానికి తిక్క రేగితే పరిస్థితి మరోలా ఉండేది అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.