
ఈ వీడియో చూసిన అధికారులు సైతం వెంటనే ఆ కండక్టర్ ను అరెస్టు చేశారు. అరెస్టు అయిన వ్యక్తి ప్రదీప్ కశప్ప నాయక్. బస్ లో ప్రయాణిస్తున్న ఒక యువతి నిద్రలో ఉండగా ప్రదీప్ ఆమె దగ్గరకు వెళ్లి మరి ఆమె శరీరం పై ప్రైవేట్ పార్కుల పైన చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. అయితే ఈ వీడియోని అక్కడే ఉన్న మరొక ప్రయాణికులు సైతం ఈ వీడియోని తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేయడంతో వెంటనే పోలీస్ అధికారులు గుర్తించి మరి ఈ వీడియో ఆధారంగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కండక్టర్ ప్రదీప్ పైన కూడా కేసు ఫిర్యాదు చేయడం జరిగింది.
న్యాయసంహిత సెక్షన్-74 ,75 ప్రకారం లైంగిక వేధింపులు కేసు చట్టం కింద నమోదు చేయడంతో కోర్టు సైతం 15 రోజులు రిమాండ్ లో ఉంచాలని సూచించారు. ఈ విషయం తెలిసిన కర్ణాటక ఆర్టీసీ విభాగం ప్రదీప్ ను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. కోర్టులో విచారణ పూర్తి అయ్యేవరకు తన సేవలను నిలిపివేయాలి అంటూ రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఈ విషయం పైన స్పందించడం జరిగింది. విచారణ పూర్తి చేసి సంబంధిత వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా తెలియజేశారు ఇలాంటి ఘటనలు మళ్ళీ ఎక్కడ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటు తెలియజేశారు మంత్రి. అయితే ఈ వీడియో చూసిన తర్వాత పలువురు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.