ఈ మధ్యకాలంలో యువత మరింత రెచ్చిపోతుంది . మరీ ముఖ్యంగా రోడ్డుపైనే కొన్ని కొన్ని అసభ్యకరమైన పనులు కూడా కానిచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఏ పార్క్ కి వెళ్ళిన .. ఏ చెట్టు పొదల్లో చూసిన లవర్స్ కి సంబంధించి దారుణాతి దారుణమైన పనులే కనిపిస్తున్నాయి . అయితే ఇలాంటి క్రమంలోనే లక్నోలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో ట్రెండ్  అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేసే విధంగా వైరల్ అవుతుంది . పట్టపగలు అది కూడా నడి రోడ్డుపై ఇద్దరు లవర్స్ కొట్టుకున్నారు . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మాధ్యమాలల్లో ట్రెండ్ అవుతుంది. 


ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని లక్నో జరిగింది . అది కూడా పోలీస్ స్టేషన్ కి సమీపంలోనే . గోమతి నగర్ పోలీస్ స్టేషన్ కు కొంత దూరంలోనే లవర్స్ ఇద్దరూ జుట్టులు పట్టుకొని మరీ కొట్టుకున్నారు.   నడిరోడ్డుపై ఇంత ఘర్షణ జరుగుతున్న ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆపే ప్రయత్నం చేయలేదు.  అంతేకాదు అక్కడ జరుగుతున్న గొడవలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.  ఇది కాస్త వైరల్ గా మారింది . ఎందుకు ఆ ఇద్దరు లవర్స్ గొడవపడ్డారు అనేది మాత్రం తెలియలేదు . ఇద్దరి మధ్య గొడవ మాత్రం చాలా తారాస్థాయికి చేరింది .



మొదటగా సైలెంట్గా ఒకరిని ఒకరు పిడుగుద్దులతో కొట్టుకున్నా ఆ తర్వాత మాత్రం హద్దులు మీరిపోయారు ఇద్దరు . ఒకరు జుట్టు ఒకరు లాక్కుంటూ  మరి కొట్టుకున్నారు . ఈ ఘటనని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారిపోవడంతో ఈ విషయం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. అస్సలు  ఎందుకు గొడవపడ్డారు..? అసలు వీరు ఎవరు..? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకపక్క గోమతి  నగర్ పోలీస్ స్టేషన్ లో వీళ్ళు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు అంటూ పోలీసుల స్వయంగా తెలిపారు.  ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతోనే ఇలా కొట్టుకున్నారు అంటున్నారు జనాలు.  మరి కొందరు మాత్రం అతగాడికి మూడ్ వచ్చుంటుంది...ముద్దు అడిగాడు ఇవ్వను అని ఉంటుంది.. అందుకే కొట్టుకున్నారు అంటుంటే మరికొందరు ఏ లిప్స్ స్టిక్ లేదా క్లిప్ అడిగిఉంటుంది.. కొనిచ్చి  ఉండడు. అందుకే ఈ విధంగా కొట్టుకుంటున్నారు .. లవర్స్ మధ్య ఇవన్నీ కామన్ .. పగలు  కొట్టుకోవడాలు.. రాత్రి గిల్లుకోవడాలు  ఇవన్నీ కామనే అంటూ  ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు . మరి కొంతమంది సిగ్గు లేదా..?  పట్టపగలు రోడ్డుపై కొట్టుకుంటున్నారు ఈ వీడియో మీ తల్లిదండ్రులు చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు..!



మరింత సమాచారం తెలుసుకోండి: