
ఈ ఘటన విద్యాసంస్థల్లో వ్యక్తిగత గౌరవాన్ని అలాగే మానవ హక్కుల మరియు లైంగిక సమానత్వం వంటి అంశాలపై తీవ్ర చర్చకు దారి తీసింది . ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. నైజీరియాలోని ఒలాబీసీ బొనాంజో యూనివర్సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది . పరీక్షకు హాజరైనందుకు బాలికలు విద్యార్థినీలు అందరూ లైన్ లో నిలుచున్నారు . వాళ్లకి డ్రెస్ కోడ్ రూల్స్ పెట్టింది . కురచా దుస్తులు వేసుకున్న వారికి మాత్రమే అనుమతి అంటూ కండిషన్స్ పెట్టింది . శరీర భాగాలు కొంచెం కనిపించిన అది వర్సిటీ నైతికతను దెబ్బతీసే అంశంగా పేర్కొంది. పైగా ఎదుటివాళ్లను అలా రెచ్చగొట్టడం కిందకే వస్తుంది అంటూ తెలిపింది. ఈ క్రమంలోనే "నో బ్రా నో ఎంట్రీ ఫర్ ఎగ్జామ్" అనే రూల్ ని కఠినంగా అమలు చేయించింది . ఎవరైతే బ్రా వేసుకోరో.. అలాంటి వాళ్ళకి ఎగ్జాం హాల్లోకి అనుమతి లేదు . అయితే ఈ రూల్ పై మాత్రం అధికారికంగా ఆ యూనివర్సిటీ స్పందించట్లేదు . మరోవైపు విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఈ విధానంపై మిశ్రమ స్పందన తెలియజేయడం గమనార్హం.
కాగా ఈ వీడియోపై చాలామంది మండిపడుతున్నారు. మానవ హక్కుల సంఘాల ప్రతినిధి హరోనా కి మాత్రం ఇది విద్యార్థి హక్కులను ఉల్లంఘించిన చర్య పేర్కొంటున్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలి అంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు . మరొక పక్క చేదు అనుభవం ఎదురైన విద్యార్ధినులు మాత్రం ఈ విధానాన్ని లైంగిక వేధింపుగా అభివర్ణించారు . ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది . ఇలాంటి ఒక రూల్ అసలు పెట్టనే పెట్టకూడదు అంటూ మహిళలు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు .
గమనిక: పై వీడియో కేవలం వార్తకు అనుగుణంగా అందించిన సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడినది. ఎటువంటి అశ్లీలతను ఎంకరేజ్ చేసే దానికోసం కానే కాదు . ఇది ఎవరిని అగౌరవపరచడం కోసం అంతకన్నా కాదు అనేది పాఠకులకు గుర్తుంచుకోవాలి..!!