మన ఇండియాలో చాలామంది డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు . మరి  ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత బాడీలో ఇమ్యూనిటీ పెరగాలి అంటూ హెల్త్ డైట్ అంటూ డాక్టర్లు ఎక్కువుగా  సజెస్ట్ చేస్తూ ఉండడంతో ఓట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు.  మరీ ముఖ్యంగా వందలో 80 శాతం మంది ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్  ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు . నట్స్ మిల్క్ షేక్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు . వీటికోసం నట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ . నట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు.  ఆ కారణంగానే ఎక్కువ మంది నట్స్ తీసుకుంటూ ఉంటారు .


అయితే ప్రెసెంట్ ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న వార్ కారణంగా ఆ నట్స్ రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి . ఒకప్పుడు మీద ఇప్పుడు ఇంకా ఇంకా ఎక్కువగా పెరిగిపోతూ ఉండడం అందరికీ ఇబ్బందికరంగా మారిపోతుంది.  యుద్ధాలు మరియు రాజకీయ అస్థిరతలు డ్రైఫ్రూట్ సరఫరా కొనుగోలు పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.  మరీ ముఖ్యంగా ఆఫ్గనిస్థాన్  మరియు ఇరాన్ నుండి  వచ్చే  డ్రై ఫ్రూట్స్ సరఫరాలో అంతరాయం కారణంగా ధరలు భారీగా పెరిగిపోయాయి.



మరీ ముఖ్యంగా పిస్తా , ఎండుద్రాక్ష , ఆప్రికాట్ , అంజీర్ , ఫైండ్ నట్స్ ధరలు అమాంతం  ఆకాశాన్ని అంటిపోతున్నాయి . సుమారు 35% పెరిగినట్లు తెలుస్తుంది . అయితే ఇరాన్ - ఇజ్రాయిల్ వార్  ఇప్పుడు అప్పట్లో ఆగేళ్ల లేదు మధ్యలోకి డోనాల్డ్ ట్రంప్ కూడా తల దూర్చాడు. ఇప్పుడు వార్  మరింత సీరియస్ అయిపోయింది.  ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో  ఇరాన్ - ఇజ్రాయిల్ వార్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.  కాగా ఇదే క్రమంలో ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య వార్ ఆగకపోతే డ్రై ఫ్రూట్స్ ధరలు ఆకాశాన్ని అంటడమే కాదు ఇక అసలు డ్రై ఫ్రూట్స్  కొనాలి అంటే వణుకు పుట్టే విధంగా మారిపోతుంది.



ఇలాగే ఇరాన్ - ఇజ్రాయిల్ వార్  కొనసాగితే కచ్చితంగా మరో ఆరు నెలల్లో ఎండుద్రాక్ష ధర 3000 ..పిస్తా  ధర దాదాపు ఐదు వేలు పైగానే పెరిగిపోతాయి అంటున్నారు నిపుణులు.  యుద్ధం దేశ ఫైనాన్షియల్ పొజిషన్ ని కూడా దెబ్బతీస్తుంది . ఇజ్రాయిల్ వార్ ఆపుకుంటే మంచిది అంటున్నారు.  కొన్ని డ్రైఫ్రూట్స్ ధరలు వారంలోనే అంతకు అంత పెరిగిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.  ఒకవేళ ఇదే కొనసాగితే మాత్రం పిస్తా లాంటి నట్స్ మనం తినడం మానేసుకోవాలి అంటూ కామన్ పీపుల్స్ కూడా మండిపడుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: