
ఇక అది కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఎంతో సపోర్టుగా ఉంటుంది .. గత రెండేళ్లు చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో నిత్యవసర ధరలు కూడా కొంతమేరకు ఒడిదుడులకు లోనవుతున్నా .. ప్రజలు భరించలేని పరిస్థితి అయితే వెళ్ళలేదు .. అయితే ఇప్పుడు ఈ పరిణామాలపై ఆర్బిఐ కూడా కొంత ఆనందం వ్యక్తం చేసింది .. దేశంలో ద్రవయోల్బణం ఎంతో నిలకడగానే ఉందని .. అందుకే రేపో (బ్యాంకులు వసూలు చేసే వడ్డీ) నీ తగ్గించామని కూడా చెప్పుకు వస్తుంది .. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా దేశంతీవ్ర ఆర్ధిక కుదుపుకు గురయ్యే అవకాశం కనిపిస్తుందని ఆర్థిక నిపుణులు గట్టి అంచనా వేస్తున్నారు ..
ఇజ్రాయిల్ , అమెరికాలు .. ఇరాన్ పై దాడులు చేయటం . ఎంతో కీలకమైన అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకున్న క్రమంలో ప్రపంచ దేశాలకు .. మరియు ముఖ్యంగా భారత్ కు కీలకమైన `హర్మూజ్` జల సంధి ( ఈ మార్గం ద్వారానే నౌకలు ప్రయాణం చేస్తాయని ) ఇరాన్ పార్లమెంట్ మూసేసింది .. అలాగే దీని తక్షణం అమలు కూడా చేసింది .. ఈ ఫలితంగా ఈ మార్గం ద్వారా భారతదేశానికి వచ్చే చమురు నౌకలకు మరో మార్గం లేదు .. ఈ ఫలితంగా దేశంలో చమురు ప్రజల అవసరాలకు తగినంత సమకూర్చే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు .. ప్రస్తుతం దేశం 90% పెట్రోల్ డీజిల్ వంటి వాటిని ముడి పదార్థాలుగా ఇరాన్ సహా దుబాయ్ ల నుంచి తెచ్చుకుంటుంది ..
ఇక ఈ దిగుమతి చేసుకునే చమురు హార్మోజ్ జలసంది ద్వారానే గుజరాత్ లోని బాంద్రా నౌకాశ్రయానికి వస్తాయి .. ఇక ఇప్పుడు ఇరాన్ దీనిని నిలిపివేసిన క్రమంలో .. ఇతర మార్గాలు మనకు లేవు .. ఇక ఎప్పుడూ వినియోగించే చమురులో 40% మేరకు , నెలవారి వినియోగంలో 90 శాతం కోతకు ప్రభుత్వం సిద్ధం కాబోతోంది .. ఇదే జరిగితే .. చమురు డిమాండ్ మరింత పెరిగి .. ధరలపై గట్టి ప్రభావం చూపుతుందని అంటున్నారు .. ఇక దీంతో అన్ని నిత్యవసరాల ధరల తో పాటు రెపో రేటును కూడా మరింత పెంచక తప్పదు .. ఈ ఫలితంగా మరోసారి ప్రజలపై గట్టి ఆర్థిక భారం తప్పదని కూడా పేర్కొంటున్నారు .. ఇదే క్రమంలో భారత రూపాయి పైన కూడా ఈ ప్రభావం పడుతుందని అంటున్నారు .. ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే 87 రూపాయిలుగా ఉన్న మన కరెన్సీ .. 100కు చేరుకునే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ..