ప్రస్తుతం ఎయిర్ ఇండియా పేరు చెబుతనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు .. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత.. ఎయిర్ ఇండియా విమానాల గురించి రోజుకొక వార్త బయటికి వస్తూనే ఉంది .. ప్రధానంగా ఈ విమానాల నాణ్యత లోపం సరైన మెయింటెనెన్స్ లేకపోవటం .. ఇలా ఈ సంస్థ‌లో జరుగుతున్న లోపాలు బయటికి వస్తూనే ఉన్నాయి .. అయితే ఇప్పుడు తాజాగా లండన్ నుంచి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో కొంతమంది ప్రయాణికులు , సిబ్బంది ఆరోగ్యం ఆకస్మాస్తుగా క్షీణించింది .. ఇక దీంతో విమానం ముంబై ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత .  అందరిని మెడికల్ రూమ్ కు తరలించారు .. ఇక ప్రస్తుతం వారి పరిస్థితి కొంత మెరుగుపడినట్లు తెలుస్తుంది .. పూర్తి మేటర్ లోకి వెళితే ..


ఎయిర్ ఇండియా విమానం 130 లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి ముంబైకి బయలుదేరింది .. అలా విమానం గాల్లో ఉన్న సమయంలోనే లోపల ఉన్న ఐదుగురు ప్రయాణికులు , ఇద్దరు సిబ్బంది ఆరోగ్య పరిస్థితి పూర్తిగా దిగజారి .. అలాగే వీరందరికి ఉన్నట్టుండి అకస్మాత్తుగా తల తిరుగుతూ , వికార వాంతులు కూడా మొదలయ్యాయి .. ఇక దాంతో విమానాన్ని ముంబై విమానాశ్రయంలో ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా ల్యాండింగ్ చేశారు .. ఆ తర్వాత వైద్య బృందం అక్కడికి వచ్చి వారిని మెడికల్ రూమ్ కి తీసుకువెళ్లారు .. అలాగే వారందరికీ వైద్యం అందించారు .. ఈ సంఘటన గురించి  ఎయిర్ ఇండియా ప్రతినిధి మీడియాకు పూర్తి సమాచారం ఇచ్చారు ..



ఈ విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయింది .. అలాగే మా వైద్య బృందం ప్రయాణికులకు సిబ్బందికి తక్షణ సహాయం అందించి ల్యాండింగ్ తర్వాత కూడా ఇద్దరు ప్రయాణికులు ఇద్దరు సిబ్బంది  కొంత అసౌకర్యంగా ఉన్నారు . వారిని కూడా తక్షణం మెడికల్ రూమ్ కి తీసుకువెళ్లారు చికిత్స తర్వాత వారిని డిస్చార్జ్ చేశారు .. ఈ దుర్ఘటనపై మేము దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు ..


మరింత సమాచారం తెలుసుకోండి: