అదృష్టం ఏంటి దరిద్రం పట్టినట్టు పట్టింది... అనేలా మిచిగాన్‌లో ఓ ఓ ఘటన చోటు చేసుకుంది. కోట్లకొద్దీ డబ్బు లాటరీలో గెలుచుకున్నాడు. అది కూడా ఒక్కసారి కాదు రెండుసార్లు. అతని దశ మారిపోయింది. మూడు సంవత్సరాల్లో  మరోసారి 4 మిలియన్ డాలర్లు లాటరీని గెలుచుకున్నాడో మిచిగాన్ వ్యక్తి. మిచిగాన్ లాటరీ ఇన్ స్టంట్ ఆటలో అతడికి రెండవసారి అదృష్టం కలిసి వచ్చింది. లాటరీలో ఆ వ్యక్తి 4 మిలియన్ డాలర్లు గెలుచుకున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.ఇలాంటి అదృష్టవంతుడు ఎవరో నీకు తెలుసుకోవాలనుందా..? అతని జీవిత చరిత్ర  చూద్దామా మరి..? లాటరీ రాకముందు అతను ఏం చేశాడో తెలుసుకుందాం..!

 

 

 

 ఈ లాటరీ టికెట్‌ను కార్లెటన్‌లోని యాష్ మార్కెట్ నుంచి టికెట్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. టికెట్‌ను ఓ ప్రత్యేక నాణెంతో స్క్రాచ్ చేశాను అని అన్నాడు. లక్షలాది మందిలో తాను రెండవ సారి 4 మిలియన్ డాలర్లు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.రెండవ సారి లాటరీ గెలిచిన అనుభూతిని వర్ణించటానికి మాటలు రావటంలేదు. మా నాన్నగారు 10 ఏళ్ల క్రితం ఇచ్చిన నాణెం నాకు అదృష్టాన్ని తెచ్చి పెట్టింది. ఆ నాణెం నేను గెలవటానికి ఎంతో సహాయపడిందని అనుకుంటున్నాను’ అని తెలిపాడు. క్లార్క్ 2017లో జాక్ పాట్ కొట్టిన తరువాత ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాను.

 

 

 

 

ఆ తర్వాత మా నాన్న గారితో కలిసి చేపలు పట్టడానికి వెళ్లేవాడని. ఆ జ్ఞాపకాలను మరచిపోలేనివి. మళ్లీ 3 ఏళ్ల తర్వాత 4 మిలియన్ డాలర్లు గెలిచాను. కానీ తాను గెలుచుకున్న 4 మిలియన్ డాలర్లు (రూ.30,33,02,000) బదులుగా 2.5 మిలియన్ డాలర్లును తీసుకోవాలని నిర్ణయించుకున్నానని అన్నాడు. నేను నా జీవితంలో ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నాను, కానీ ప్రస్తుతం అంతా బాగుందని క్లార్క్ చెప్పుకొచ్చాడు. వచ్చిన లాటరీలో కొంత మాత్రమే తీసుకోవడం వెనకాల ఏదో బలమైన కారణం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: