ఈ ప్రపంచంలో ఎంతో మంది సునాయాసంగా పెద్దగా ఇబ్బంది లేకుండా విజయాలను అందుకుంటూ లగ్జరీగా బ్రతికేస్తుంటే మనకు మాత్రమే ఎందుకు ఎప్పుడూ నిరాశే ఎదురవుతుంది. అసహనం, అసంతృప్తుల తోనే జీవితం గడిచిపోతోంది. ఆమడ దూరంలో ఉన్న విజయం కూడా అందకుండా పోతోంది అందుకు చాలా నిరాశగా ఉంటారు నిజానికి ఇలాంటి వారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి. అయితే అనుకుంటే సాధించలేనిది ఉండదని పెద్దలు చెబుతుంటారు. ఒకటి రెండు సార్లకే నిరాశలో కూరుకు పోయి విజయం అందలేదు అంటే ఎలా ? విజయం అందుకున్న ప్రతి ఒక్కరి వెనుక కనిపించని శ్రమ, కష్టం వారి గట్టి ప్రయత్నాలు ఇలా ఎన్నో దాగి ఉంటాయి.

ఎవరో కొందరికి అదృష్టవశాత్తు ఏదో అలా విజయం అందుతుంది. కానీ అందరికీ అలా వుండదు. ఆ విజయం వెనుక  ఎన్నో దాగి ఉంటాయి. అందుకే లక్ష్యాన్ని చేరుకున్న వారిని చూసి నేను ఇలా అనుకున్నది సాధించాలి అని కేవలం ఆశపడితే సరిపోదు అందుకు తగ్గ ప్రయత్నం కూడా ఉండాలి. ఎపుడైతే మీ లక్ష్యం స్థిరంగా ఉంటుందో, ఎపుడైతే మీ లక్ష్యం కోసం సంకల్పించి పయనాన్ని మొదలు పెడతారో అపుడు మీరు అనుకున్నది సాధించగలరు అని అనుభవజ్ఞులు చెబుతున్న మాట. కృషి పట్టుదల అనేవి కేవలం మాటల్లో కాదు మీ ప్రయత్నం లోనూ కనిపించాలి.

ఏదేమైనా కోరుకున్న లక్ష్యాన్ని సాధించాలి అన్న ఆలోచన మీ మనసులో ఎపుడు ఉండాలి అన్నది గుర్తుంచుకోవాలి. అనుకున్నది అందుకునే వరకు గురి తప్పకుండా శ్రమిస్తూనే ఉండాలి. ఒక పనిని అనుకున్నప్పుడు తగిన కమిట్మెంట్ తో పని చేయాలి. మీరు కమిట్మెంట్ తో చేసే పని వలన వచ్చిన ఫలితం ను చూడండి, అలాగే కమిట్మెంట్ లో లోపం ఉన్న పని వలన వచ్చిన ఫలితం చూడండి.. రెండింటిలో ఖచ్చితంగా తేడా ఉంటుంది. అందుకే మీరు ముందుగా ఏ పని చేసినా ఒక కమిట్మెంట్ తో చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: