మన వ్యాపారం గురించి అందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. కస్టమర్స్ ను ఆకర్షించే విధంగా మన షాప్ కి లేదా సదరు వ్యాపారానికి అలవాటు పడే వరకు నష్టం రాకుండా లాభం కోసం ఎక్కువగా ఆరాట పడకుండా వీలయినంత వరకు భారీగా డిస్కౌంట్ లు, ఆఫర్లు వంటివి పెట్టాలి. ఇలా పలు విధాలుగా కస్టమర్లను ఆకర్షిస్తూ అలవాటు పడేలా చేయాలి.
మీ ఏరియాకు తగిన విధంగా వ్యాపారాన్ని మలుచుకోవడం చాలా అవసరం... మీ కస్టమర్స్ తో ఎప్పుడూ ఎంతో ప్రేమతో మెలగాలి. వ్యాపారానికి సంబంధించి ఎప్పుడైనా కస్టమర్స్ దేవుళ్ళు అన్న భావన మీ మనసులో ఉండాలి. అప్పుడే మీ షాప్ కి రావడానికి ప్రజలు ఇష్టపడుతారు.
అంతే కాకుండా మీరు ఉన్న ఏరియా లో మీకు పోటీగా ఏమైనా షాప్స్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే... వారికి మించి కస్టమర్లను ఏ విధంగా ఆకట్టుకోవాలి అన్న విషయం గురించి ఒక ప్రణాళిక వేసుకోవాలి.
ఇలా మీరు వ్యాపారం స్టార్ట్ చేసినప్పటి నుండి అన్ని విషయాలను గమనించుకుంటూ మెల్ల మెల్లగా అభివృద్ధి చేసుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి