
ఇక గర్భిణులు తీసుకొనే పండ్లలో డ్రాగన్ ఫ్రూట్ తినాలా వద్ద అనే సందేహం చాల మందిలో ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ సూపర్ మార్కెట్లో చాల విరివిగా దొరుకుతున్నాయి. అయితే గర్భిణులు గర్భధారణ సమయంలో డ్రాగన్ ఫ్రూట్ తినడం మంచిదేనా. ఈ పండును తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి చూద్దామా.
అయితే డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే పోషకాల వాళ్ళ గర్భిణీ మహిళకు అలాగే కడుపులో ఉండే బిడ్డకు శక్తిని అందిస్తుంది.ఆ సమయాల్లో కాస్త నీరసం ఉంటుంది అవన్నీ డ్రాగన్ ఫ్రూట్ తింటే తొలిగిపోతాయి. డ్రాగన్ ఫ్రూట్ లో క్యాల్షియం,పొటాషియం,ఐరన్,ప్రోటీన్స్,విటమిన్ సి, ఫైబర్,బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ లో మంచి కొవ్వులు ఉంటాయి.డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుంది.
అంతేకాదు.. డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే ఫైబర్ మలబద్దకము సమస్యను తగ్గిస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. డ్రాగన్ ఫ్రూట్ లో ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ రక్త హీనత సమస్య లేకుండా చేయడమే కాకుండా రక్త కణాలు ఆక్సిజన్ ను మోసే సామార్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇక పిండం దాని ఎముక నిర్మాణాన్ని అభివృద్ధి చేయటానికి అవసరమైన ఖనిజాలు క్యాల్షియం ఫాస్ఫరస్ అనేవి డ్రాగన్ ఫ్రూట్ లో సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా గర్భిణి స్త్రీలలో దంత సమస్యలు లేకుండా చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ ను ముక్కలుగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవొచ్చు ఇలా డ్రాగన్ ఫ్రూట్ ను ఏ విధంగా తీసుకున్న అన్ని ప్రయోజనాలు పొందావోచ్చు.