గర్భధారణ సమయంలో గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆహారం విషయంలో అయితే ఏది తినాలి. ఏది తినడకూడదో అని వైద్యుల సలహాను తీసుకోవాలి. సాధారణంగా గర్భిణులు తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. అయితే కొంతమంది గర్భిణులు సాధారణంగా బరువు పెరుగుతూనే ఉంటారు. ఇక బాగా బరువు పెరగడం వల్ల జెస్టేషనల్‌ డయాబెటీస్‌ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది గర్బధారణ సమయంలో మాత్రమే వస్తుంది. బరువు ఎక్కువ ఉన్న గర్భిణులు తక్కువ చక్కెర పదార్థాలు ఉండే పండ్లను తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గర్భధారణ సమయంలో గర్భిణులు ఎలాంటి పండ్లను తీసుకోవాలి. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిదో ఒక్కసారి చూద్దామా. గర్భిణులు దానిమ్మ పండును తీసుకోవడం చాలా మంచిది. ఇక దానిమ్మ పండులో నియాసిన్, పొటాషియం, కాల్షియం, విటమిన్‌ సి, ఫోలేట్, ఐరన్, ఫైబర్లు సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాక.. దానిమ్మను నేరుగా గానీ లేదా జ్యూస్‌ రూపంలో గానీ తీసుకోవటం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ పండు తినడం వలన రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచుతుంది. అంతేకాదు.. దానిమ్మ పండులో ఉండే పోషకాలు తిమ్మిరి, నిద్ర సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇక శిశివు రక్త ప్రసరణను పెంచడానికి దోహదపడుతుంది. ఈ పండును తినడం వల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ప్రమాదం తప్పుతుంది.

గర్భిణులు అరటి పండు తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక అరటి పండులో ఉండే విటమిన్‌ బి6 సమృద్ధిగా లభిస్తాయి. ఇవి జీర్ణక్రియ మెరుగుపడటానికి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదపడుతాయి. అంతేకాదు.. రక్తహీనత తగ్గిస్తుంది. ఇక అరటి పండులో విటమిన్‌ సి, రైబోఫ్లావిన్, ఫోలేట్, ఇతర న్యూట్రీషియన్స్‌ కూడా లభిస్తాయి. ఇవి మెదడు, నాడీ వ్యవస్థ, వెన్నెముక ఏర్పడటానికి అవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ను అందజేస్తుంది. అంతేకాదు.. మలబద్దకం సమస్యను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: