సాధారణంగా ప్రెగ్నెసీ సమయంలో మహిళలో చాలా ప్రశ్నలు తలెత్తుంటాయి. అయితే గర్భధారణ సమయంలో నొప్పులు ఎందుకు వస్తాయో ఒక్కసారి చూద్దామా. శిశువుకు జన్మను ఇచ్చే పవిత్రమైన గర్భాశయ ద్వారం బలహీనంగా ఉండటం వలన ప్రసవ సమయంలో నొప్పులు ఎక్కువగా రావడానికి ఒక కారణం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. బిడ్డ ప్రసవించే సమయానికి తల ముందుకు వస్తూ బయటకు వస్తుంటుంది. అయితే కొన్నిసార్లు తలపై భాగంలో ఉండి కాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. అలాంటి సమయంలో నొప్పులు ఎక్కువగా వస్తాయని అన్నారు.గర్భిణులు తీసుకునే ఆహారంలో పోషకాలు, పౌష్టిక ఆహారం సరిగ్గా లేకపోవడం, రక్త వృద్ధిని పెంచే ఆహారాలు లేకపోతే ప్రసవ సమయంలో నొప్పులు, రక్తహీనత రావడానికి కారణం అవుతుందన్నారు.

అయితే బిడ్డ అధిక బరువుతో గానీ లావుగా ఉన్నప్పుడు ప్రసవ సమయంలో నొప్పులు ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక..  గర్భవతి అయిన సమయంలో మీరు పడుకునే విధానం, నిద్రించే సమయం కూడా ప్రసవ సమయంలో నొప్పులపై ప్రభావం ఉంటుందని అన్నారు. గర్భధారణ సమయంలో స‌రైన పోజీష‌న్‌లో ప‌డుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాక.. గర్భంతో ఉన్నప్పుడు మంచి నిద్ర, ఎక్కువ నిద్ర కూడా అవసరం అని అన్నారు.

గర్భిణులు తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువుపై ప్రభావం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణులకు 300 కాలరీల శక్తిఅదనంగా 15 గ్రా మాంసకృత్తులు/10గ్రా కొవ్వు పదార్ధాలు అయిదు లేదా ఆరు నెలల గర్భధారణ నుంచి తిసుకోవలసిన అవసరం చాలా ఉందని అన్నారు. అంతేకాక.. గర్భవతులు, బాలింతలు తీసుకొనే ఆహారంలో, అధనపు కాల్షియం ఉండాలని సూచించారు. వాటి వలన శిశువు ఎముకలు దంతాలు రూపు దిద్దుకోవటానికి, రొమ్ము పాలు పెరగటానికి ఇది చాలా అవసరం అన్నారు. ఇక గర్భస్ధ దశలో ఇనుము లోపంతో వచ్చే రక్తహీనత, కాన్పు సమయంలో తల్లి మరణానికి దారి తీస్తుందని అన్నారు. పిల్లలు తక్కువ బరువుతో పుడతారు కనుక, ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవలసి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: