పెగ్నెసీ సమయంలో మహిళలు బరువు పెరగడం, తగ్గడం రెండూ హానికరమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్కువ బరువు పెరగడం వల్ల గర్భధారణ మధుమేహం, అధిక బీపీ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. అయితే ఆ పరిస్థితి తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదకరం అని చెబుతున్నారు. ఇక అదే సమయంలో, సగటు బరువు కంటే తక్కువగా ఉండటం కూడా ప్రమాదామనే చెబుతున్నారు.

సాధారణంగా ఒక వ్యక్తి బరువును, ఆరోగ్యాన్ని శరీర పొడవు ఆధారంగా లెక్కించడం జరుగుతుందని చెబుతున్నారు. ఇక గర్భధారణ సమయంలో మహిళ బరువు కనీసం 45 కిలోలు ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాదు.. గర్భం దాల్చిన తర్వాత 10 నుంచి 15 కిలోల బరువు పెరగాలని చెబుతున్నారు. గర్భిణులు తక్కువ బరువు ఉంటే, అప్పుడు స్త్రీ తక్కువ బరువు ఉన్నట్లుగా పరిగణలోకి తీసుకుంటున్నారు. కాగా.. ప్రెగెన్సీ సమయంలో స్త్రీ తక్కువ బరువు ఉన్నట్లయితే గర్భస్రావం, సి-సెక్షన్ డెలివరీ ప్రమాదం పెరుగుతుందని తెలిపారు.

గర్భిణులు బరువు తగ్గడం వల్ల కడుపులోని పిల్లలకు హానీ జరగవచ్చు అని చెబుతున్నారు. ఇక గర్భిణులకు అవసరమైన పోషకాలు తల్లీ, బిడ్డకు అందక.. పుట్టబోయే బిడ్డ భవిష్యత్‌లో పోషకాహారం లోపంతో బాధపడుతారని చెబుతున్నారు. అంతేకాక.. ఇక పుట్టినప్పుడు శిశువు బరువు చాలా తక్కువగా ఉంటే భవిష్యత్‌లో మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.  అయితే తక్కువ బరువు కారణంగా శిశువు రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నట్లు తెలిపారు. కాగా.. గర్భిణీలు  ప్రతిసారి ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతారని వెల్లడించారు. గర్భిణులు  తక్కువ బరువుతో పుట్టిన బిడ్డకు సెరిబ్రల్ పాల్సీ, అభ్యాస వైకల్యాలు, దృష్టి మరియు వినికిడి సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.

అయితే గర్భిణులు బరువు పెరగడానికి ఇవి పాటించాలని చెబుతున్నారు. గర్భిణులు ప్రతిరోజూ అల్పాహారంలో ప్రోటీన్స్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే భోజన సమయాలను సెట్ చేసుకొని గంటకోసారి లేదా రెండు గంటలకోసారి కొంచెం కొంచెం ఏదో ఒక్కటి తినాలని చెబుతున్నారు. అంతేకాదు.. పండ్లు, ఫలాలు, డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్ వంటివి తినాలని చెబుతున్నారు. ఇక  కాల్షియం కోసం పాలు, పెరుగు, జున్ను, మొలకెత్తిన ధాన్యాలు, బీన్స్ మొదలైనవి తీసుకోవాలని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: