ఇక 2023 ఆటో ఎక్స్‌పో లో హంగేరియన్ కంపెనీ 'కీవే' (Keeway) తన SR250 నియో రెట్రో మోటార్‌సైకిల్‌ ని రిలీజ్ చేసింది. కంపెనీ విడుదల చేసిన SR250 బైక్ ధర రూ.1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉంది.కీవే ఇండియా ఇప్పటికే SR125ని రిలీజ్ చేసింది. కాగా ఈ కొత్త సంవత్సరంలో మరో బైక్ SR250ని రిలీజ్ చేసింది. ఈ రెట్రో మోటార్‌సైకిల్‌ ఇండియన్ మార్కెట్లో TVS రోనిన్, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఇంకా కవాసకి W175 వంటి వాటికి పోటీగా ఉంటుంది. అందువల్ల ఇండియాలో ఈ విభాగంలో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ బైక్ చూడటానికి దాని మునుపటి మోడల్ లాగా వున్నా కూడా ఇందులో కొన్ని అప్డేటెడ్ మార్పులు ఉన్నాయి.కీవే SR250 మోటార్‌సైకిల్‌ సూపర్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్ రౌండ్ హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, క్రోమ్ సరౌండ్‌లతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, సిలిండర్ బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్, నాబ్డ్ టైర్లు ఇంకా అలాగే స్పోక్డ్ వీల్స్ వంటి వాటిని ఈ బైక్ పొందుతుంది. ఇంకా అంతే కాకుండా ఈ బైక్ లో సింగిల్ పీస్ సీటు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.


ఇక ఈ బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బైకులో కలర్డ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, LED DRL లు, హజార్డ్ స్విచ్, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఈ బైక్ లో డ్యూయల్ ఛానల్ ABS కూడా అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన ప్రియులకు చాలా మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ని అందించడంలో సహాయపడతాయి.ఇక ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కీవే SR250 మోటార్‌ సైకిల్ 223 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ ని కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 7,500 rpm వద్ద 16 bhp పవర్ ఇంకా అలాగే 6,500 rpm వద్ద 16 Nm మాక్సిమం టార్క్‌ ని రిలీజ్ చేస్తుంది. అలాగే పనితీరు పరంగా కూడా మంచిగా ఉంటుంది. కీవే SR250 బైక్ బరువు కేవలం 120 కేజీలు మాత్రమే ఉంటుంది. అందువల్ల దీన్ని రైడింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: