ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా రెంజ్ సినిమాల‌తో బిజీ గా ఉన్నాడు. అయితే ప్ర‌భాస్ సినిమా చ‌రిత్ర బాహుబ‌లి ముందు ఒక‌లా త‌ర్వాత ఒక‌లా ఉంది. అయితే పాన్ ఇండియా స్టార్ గ‌తంలో చాలా హిట్ సినిమా ల‌ను మిస్ చేసుకున్నాడు. అలాంటివి ప్ర‌భాస్ లిస్ట్ లో దాదాపు 10 సినిమాలు ఉన్నాయి. ముందుగా మ‌హేష్ బాబు హీరోగా గుణ శేఖ‌ర్ ద‌ర్శక‌త్వంలో ఒక్క‌డు సినిమా వ‌చ్చింది. అయితే ఈ ఒక్క‌డు సినిమా క‌థ ముందుగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కు కృష్ణం రాజ్ కు చెప్పాడ‌ట‌. అయితే ప్ర‌భాస్ ఈ క‌థ విష‌యంలో లోతుగా ఆలోచించి నో చెప్పార‌ట‌. దీంతో మ‌హేష్ బాబు తో గుణ శేఖ‌ర్ ఈ సినిమా ను తీశాడు. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం లో సింహాద్రి సినిమా వ‌చ్చింది. ఈ క‌థ ను కూడా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌భాస్ కు వినిపించాడు. అయితే ప్ర‌భాస్ కు ఈ క‌థ నచ్చినా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ప్ర‌భాస్ ఈ సినిమా చేయ‌డం కుదుర‌లేద‌ని స‌మాచ‌రం.



దీని త‌ర్వ‌త ఆర్య, దిల్ సినిమాల‌ కోసం దిల్ రాజ్ ప్ర‌భాస్ ను సంప్ర‌దించార‌ట‌. అయితే ఈ సినిమా స‌మ‌యంలో ప్ర‌భాస్ మ‌రొక్క సినిమా షూటింగ్ లో ఉండ‌టం వ‌ల్ల ఈ సినిమా చేయ‌లేక పోయాడు. అలాగే నాయక్ సినిమా కూడా ప్ర‌భాస్ చేయాల్సింది. కాని ఆ స‌మ‌యంలో మిర్చి, రెబ‌ల్ సినిమా ల్లో  బిజీగా ఉండ‌టం వల్ల ప్ర‌భాస్ వీలు కాలేద‌ట‌. కిక్ కథ కూడా ముందుగా ప్ర‌భాస్ వ‌ద్ద కే వెళ్లింద‌ట‌. చివ‌రికి ర‌వితేజ ను ఎంపిక చేశార‌ట‌. అలాగే బృందావ‌నం స‌మ‌యంలో ప్ర‌భాస్ డార్లింగ్, మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ సినిమా చేయ‌డంతో ఈ సినిమా ను వ‌దులు కున్నాడు. డాన్ శీను క‌థ కూడా ప్ర‌భాస్ విన్నాడ‌ట‌. అయితే అప్ప‌టికే బుజ్జి గాడు సినిమా తీయ‌డం తో రెండు సినిమా లు కొంత వ‌ర‌కు స‌మానం గా ఉన్నాయ‌ని నో చేప్పాడ‌ట‌. ఊస‌ర వెల్లి ని కూడా ప్ర‌భాస్ రిజ‌క్ట్ చేశాడ‌ట‌. అలాగే జిల్ సినిమా సమ‌యంలో బాహుబ‌లి సినిమా ఉండ‌టంతో కుద‌ర‌లేద‌ట‌. ఇలా మొత్తం ప‌ది సినిమా ల‌ను ప్ర‌భాస్ వ‌దులుకున్నాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: