నల్లమల్ల అభయారణ్యం ... ఎన్నో అడవి జంతువులకి నివాస స్థలం ... అడవిని నమ్ముకొని బ్రతికే చెంచుల కన్నా తల్లి నల్లమల్ల . ఎటు చూసిన పెద్ద పెద్ద చెట్లు లోయలు . తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో విస్తరించి ఉన్న నల్లమల్లకి ఇప్పుడు అతిపెద్ద కష్టం వచ్చింది. దట్టమైన చెట్లు , కొండలు లోయలతో ఉండే ఈ  అభయారణ్యాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


 నల్లమల్లలో యురేనియంను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం...తవ్వకాలు జరపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 4 వేల బోర్లను నల్లమలలో వేసి నమూనాలను సేకరించేందుకు సిద్ధం అయింది .దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా  సమ్మతించింది. దీంతో యురేనియం తవ్వకాలకు అంత సిద్ధం చేసుకున్నా అధికారులకు నిరసనగా సెగ తగలింది. ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నల్లమల్లలో యురేనియం తవ్వకాలు జరిగితే ఎన్నో రకాల జీవజాతులతో పాటు అడవినే నమ్ముకుని ఉన్న జీవిస్తున్న ప్రజలు దిక్కులేనివారవుతారు. 


స్థానిక ప్రజల ఆందోళనకు తెలుగురాష్ట్రాల ప్రజలతో పాటు విపక్షాలు, సెలబ్రెటీలు మద్దతు పలికారు. సేవ్ నల్లమల్ల అంటూ  నిరసన గళం విప్పుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నిరసనల కోసం వీహెచ్ అధ్యక్షతన ప్రత్యేక కమిటీని వేసింది. ప్రజల ఆందోళనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రజల మనోభావాలను అర్ధం చేసుకున్నానని..దీనిపై సీఎం కేసీఆర్ తో మాట్లాడుతానని తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: