హ్యార్లీడేవిడ్సన్ మోటార్ సైకిళ్లకు మంచి డిమాండ్ ఉంది.. మార్కెట్ లో ఈ కంపెనీ బైకులు వస్తున్నాయంటే చాలు యువత కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు..స్టైల్, మైలేజ్, తదితర అంశాలు కొనుగోలు దారుణాలను ఆకర్షిస్తుంది. అయితే చాలా మంది ఈ బండిని కొనాలని అనుకున్నా కూడా రేట్ల విషయానికొస్తే కాస్త వెనకడుగు వేస్తున్నారు. అయితే ఈ బైక్ రేటు ఇప్పటికీ కూడా 72 వేలు మాత్రమే ఉంది.స్ట్రీట్ 750, స్ట్రీట్ రోడ్ బైక్స్ రెండు ఒకే రేటు ఉండటం గమనార్హం. 



ఈ రెండు వాహనాలను బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ రెండు వాహనాలు విడుదల అయ్యి కూడా దాదాపు ఎనిమిది నెలలు కావస్తోంది.ఈ మోటార్ సైకిళ్లను సొంతం చేసుకోవాలంటే ముందుగా బుకింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లాక్ డౌన్ అనంతరం బుక్ చేసుకునేందుకు 999 రూపాయల సొమ్ము చెల్లించాలి. బైక్ డెలివరీ అందిన వెంటనే అందుకు సంబంధించిన పేపర్ వర్క్ పూర్తి చేసి మిగాత సొమ్ము చెల్లించాలి.. అలా ఆఫర్ ను ఏప్రిల్ వరకు మాత్రమే కొనసాగించారు. 



హ్యార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్లు 749సీసీ వీ-ట్విన్ రివల్యూషన్ ఎక్స్ మోటార్ ను కలిగి ఉంది. బీఎస్6 ఫార్మాట్లో రూపొందించిన ఈ మోటార్ సైకిల్ పవర్ ఔట్ పుట్ లో ఎలాంటి మార్పులేదు.  6-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థను కలిగి ఉంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ట్విన్ షాక్ రేర్ సస్పెన్షన్ స్ట్రీట్ 750, స్ట్రీట్ రోడ్ 750 మోటార్ సైకిళ్లలో పొందుపరిచారు. ప్రంట్ రేర్ వీల్స్  డిస్క్ లను కూడా కలిగి ఉంటుంది.రిచ్ లుక్ తో పాటుగా అధ్బుతమైన డిమాండ్ కూడా మార్కెట్ లో ఉంది. అందుకే ఈ బైక్ లు ఎప్పుడు మార్కెట్ లోకి వచ్చిన కూడా కొనడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఇప్పటికీ కొన్ని ఆఫర్లు ఈ బైకు లకు ఉన్నాయని అంటున్నారు. క్రిస్టమస్ కి ,సంక్రాంతి పండుగకు ఈ బైక్ లపై భారీ ఆఫర్లు ఉన్నాయని తెలుస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: