ప్రముఖ
ఆటో మొబైల్ కంపెనీలో తనకంటూ ప్రత్యేకత అందుకున్న మరో కంపెనీ బజాజ్..ఎన్నో కొత్త ఫీచర్లతో కూడిన
బైక్ లను
మార్కెట్ లో విడుదల చేసింది.. తరతరాల
చరిత్ర కలిగిన ఈ
బైక్ లకు జనాల్లో మంచి క్రేజ్ ఉంది. ఎన్ని కొత్త ఎడిషన్
బైక్లు వచ్చిన యువతలో ఆదరణ తగ్గలేదు.. ముఖ్యంగా బజాజ్ పల్సర్ బండి పై అయితే యువత ఆసక్తి మాములుగా లేదు.. తాజాగా బజాజ్ సంస్థ తన పల్సర్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్ ను సైలెంట్ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎక్స్ షోరూంలో ఈ సరికొత్త బజాజ్ పల్సర్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్ ధర వచ్చేసి రూ.1.02 లక్షలుగా సంస్థ నిర్దేశించింది.
ఈ డాగర్ ఎడ్జ్ ఎడిషన్ లో మూడు మోడళ్లను లాంచ్ చేసింది. అవే పల్సర్ 220ఎఫ్, పల్సర్ 180ఎఫ్, పల్సర్ 150ఎఫ్ మోటార్ సైకిళ్లను విడుదల చేసింది.టాప్ స్పెక్ అయిన 220ఎఫ్ మోడల్ నాలుగు రంగుల్లో లభ్యమవుతుంది. పెరల్ వైట్, సాఫీర్ బ్లూ, వోల్కైన్
రెడ్, స్పార్కిల్
రెడ్ రంగుల్లో దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ పల్సర్ 220 ఎఫ్ మోటార్
సైకిల్ ధర వచ్చేసి రూ.1.28 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. పల్సర్ 180 ఎఫ్ మోడల్లోనూ మూడు రంగుల్లో లభ్యమవుతాయి. పెరల్ వైట్, వోల్కైన్
రెడ్, స్పార్కిల్ బ్లాక్ రంగుల్లో సొంతమవుతుంది.
అయితే, వీటి ఖరీదు వచ్చేసి రూ.1.10 లక్షలు. పల్సర్ 150 ఎఫ్ మోడల్లోనూ రెండు కొత్త కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది పెరల్ వైట్, సాఫిర్ బ్లూ రంగుల్లో లభ్యమవుతుంది. ఎక్స్ షోరూంలో పల్సర్ డాగర్ ఎడ్జ్ ఎడిషన్ 150 ఎఫ్ ధర వచ్చేసి డ్రమ్, డిస్క్ వేరియంట్ల వారీగా రూ.1.05, 1.02 లక్షలు. గతంలో వచ్చిన మోడల్స్ లలో చిన్న మోడిఫికేశన్ చేసి
మార్కెట్ లోకి విడుదల చేశారు.. ఇటీవల విడుదల అయిన వాటికి డిమాండ్ మాములుగా లేదు..ఇకపోతే ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ కలర్ అప్డేట్ తో పాటు ఈ మూడు మోటార్ సైకిళ్లు సరికొత్త పెయింట్ స్కీముతో పాటు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కాకుండా డిజైన్, ఫీచర్లు, మెకానికల్ మార్పుల్లో ఎలాంటి వ్యత్యాసం లేదు.మరో కొత్త
బైక్ ను
జూన్ లో లాంఛ్ చేయనున్నట్లు సమాచారం..