ఇక దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్  భారత మార్కెట్లో విక్రయిస్తున్న కాంపాక్ట్ సెడాన్ టాటా టిగోర్ లో కంపెనీ ఇప్పుడు ఓ కొత్త కలర్ ఆప్షన్ ను ప్రవేశపెట్టింది.ఈ కొత్త టాటా టిగోర్ ఇప్పుడు బ్లాక్ కలర్ రూఫ్‌ తో కొత్త ఒపెల్ వైట్ బాడీ కలర్ ఆప్షన్‌లో కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇక ఈ డ్యూయెల్ టోన్ పెయింట్ ఫినిషింగ్‌లో టిగోర్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇదికాకుండా, మాగ్నెటిక్ రెడ్ బాడీ కలర్ ఇంకా అలాగే బ్లాక్ రూఫ్ ఆప్షన్ లో కూడా టాటా టిగోర్ అందుబాటులో ఉంది.టాటా టిగోర్ మొత్తం రెండు డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లతో పాటుగా ఇంకా మూడు మోనోటోన్ కలర్ ఆప్షన్‌లలో కూడా అందించబడుతుంది, ఇందులో డీప్ రెడ్, అరిజోనా బ్లూ ఇంకా డేటోనా గ్రే కలర్ ఆప్షన్లు ఉన్నాయి.ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, టాటా టిగోర్ దాని విభాగంలో బ్లాక్ రూఫ్ ఆప్షన్ ను పొందిన ఏకైక సెడాన్ కార్.ఈ కొత్త టిగోర్ లో కలర్ కొత్త ఆప్షన్ మినహా కంపెనీ ఈ కారులో ఇక ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు.


ఇంకా ఈ సబ్ 4-మీటర్ కాంపాక్ట్ సెడాన్ లో అందుబాటులో ఉన్న ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో మొత్తం 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు ఇంకా ఆటో-హెడ్‌లైట్ల వంటి మరెన్నో కంఫర్ట్ ఫీచర్‌లు ఉన్నాయి. ఇక అంతేకాకుండా, సేఫ్టీ పరంగా చూస్తే ఈ చిన్న కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఇంకా రివర్సింగ్ పార్కింగ్ కెమెరా వంటి స్టాండర్డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.ఈ టాటా టిగోర్ 1.2-లీటర్ న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో కూడా లభిస్తుంది. ఈ ఇంజన్ 86 బిహెచ్‌పి శక్తిని  ఇంకా 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే టాటా టిగోర్ కోసం 5-స్పీడ్ మాన్యువల్ ఇంకా ఆప్షనల్ 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక టిగోర్ కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. కస్టమర్లకు ఇందులో ప్యూర్ ఎలక్ట్రిక్ ఇంకా సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: