జగన్ , విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు తుది తీర్పు వెలువడనుంది, ఇప్పటికే వాదనలు ముగియగా నేడు సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌ మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు, బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ కోర్టు  ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. ఏపీ సీఎంగా ఉన్నత పదవిలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సాక్షుల్ని ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని, ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ రఘురామ పేర్కొన్నారు, సీఎం జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నందున బెయిల్ రద్దు చేసి.. ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని రఘురామ ఏప్రిల్ మొదటి వారంలో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: