పెగసస్‌.. ఈ స్పైవేర్ చాలా వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. కేంద్రం ఈ సాఫ్ట్‌వేర్‌తో దేశంలోని రాజకీయ నేతల ఫోన్లు టాప్ చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. అయితే.. ఈ వివాదాస్పద పెగసస్‌ స్పైవేర్‌ను 4 ఏళ్ల క్రితమే చంద్రబాబు కొన్నారని ఇప్పుడు బెంగాల్ సీఎం మమత బయటపెట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ  ప్రకటించడం సంచలనానికి దారి తీసింది.


ఈ పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అందిస్తామంటూ గతంలో బెంగాల్‌లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయట. ఈ విషయాన్ని ఇప్పుడు మమత బయటపెట్టారు. ఈ అంశం ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించినది అయినందువల్ల.. చట్ట విరుద్ధం కూడా కావడం వల్ల అప్పట్లో తాము కొనలేదని మమత అన్నారు. మొత్తం మీద ఇప్పుడు చంద్రబాబు మెడకు ఈ పెగసస్‌ వ్యవహారం చుట్టుకుంటోంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: