ఈ ఏడాది సివిల్స్ అంతా అమ్మాయిల హవా నడిచింది. తెలుగులోనూ చాలా మంది అమ్మాయిలు సివిల్స్ సాధించారు. కష్టాలు ఎదురైనా... నిరాశలు నిలువరించినా... లెక్క చేయక లక్ష్యం అందుకున్నారు. దేశపు అత్యున్నత సర్వీసులో చేరాలన్న కల నిజం చేసుకున్నారు. మొదటి అయిదు ప్రయత్నాల్లో లక్ష్యాన్ని అందుకోలేకపోయిన సాహిత్య పూసపాటి ఎనిమిదేళ్లపాటు శ్రమించి ఆరో ప్రయత్నంలో ఐ.ఎఫ్‌.ఎస్‌. సాధించింది . నిజామాబాద్‌ అమ్మాయి అరుగుల స్నేహ 136వ ర్యాంకుతో లక్ష్యాన్ని అందుకుంది.  కాకినాడ దగ్గర వలసపాకలకు చెందిన డాక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి.. పెళ్లై పాప కూడా ఉన్నా.. వైద‌్యురాలిగా జీవితంలో బాగానే స్థిరపడినా ఐఏఎస్ కావాలన్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంది డా. కొప్పిశెట్టి కిరణ్మయి.  హైదరాబాద్‌ అమ్మాయి పవిత్ర ముత్యప్‌ 608వ ర్యాంకుని సాధించింది. గతంలో ఓసారి లక్ష్యాన్ని చేరుకున్నట్టే చేరుకుని తృటిలో తప్పిపోయినా నిరాశ పడకుండా శ్రమించి ఈసారి విజయం అందుకుంది. ఎమ్మిగనూరుకు చెందిన అంబికా జైన్‌ తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించింది. ఇలా తెలుగు అమ్మాయిలు ఈ ఏడాది సత్తా చాటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: