రేపటి నుంచి ఏపీలో ఈఏపీ సెట్ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ నెల 4 నుంచి 12 వరకు ఈఏపీ సెట్‌ పరీక్షలు జరుగుతాయి. ఈ  పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నెల 4 నుంచి 8 వరకు ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 11 నుంచి 12 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఈఏపీ సెట్‌ పరీక్షల కోసం ఏపీలో 120 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఈఏపీ సెట్‌  పరీక్ష కోసం తెలంగాణలోనూ 2 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.


ఈ ఈఏపీ సెట్‌  పరీక్షలను 3.84 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. ఈసారి హాల్‌టికెట్‌తో పరీక్ష కేంద్రం రూట్‌ మ్యాప్ కూడా అధికారులు ఇస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ఈ నిబంధన కచ్చితంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కుల ధ్రువపత్రాలు తెచ్చుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాలకు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఏమైనా సందేహాలుంటే 08554-234311,232248 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: