ఏపీ సీఎం జగన్‌కు వైసీపీ మంత్రులు కొందరు చిక్కులు తెస్తున్నారు. మొన్నటికి మొన్న మంత్రి అమర్నాథ్‌ మా మేనిఫెస్టోలో మద్య నిషేధం గురించే లేదని అంటే.. ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు.. టీడీపీ వాళ్లకు రోడ్డు ఇచ్చేది లేదని కామెంట్ చేస్తూ మీడియాకు దొరికిపోయారు. టీడీపీ సానుభూతిపరులైతే, వారి ఇళ్లకు రోడ్డు వేయాలా అంటూ మంత్రి అంబటి రాంబాబు కామెంట్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది.


పల్నాడు జిల్లా రాజుపాలెంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా మంత్రి పర్యటించారు. ఓ ఇంటి గుమ్మం ముందున్న వ్యక్తి రోడ్డు వేయాలని కోరారు. ఆయన మనోడేనా  అని తన అనుచరులను ప్రశ్నించిన అంబటి.. వారు కాదనేసరి ముఖం చిట్లించారు. టీడీపీనా.. అయితే మీరు రోడ్డు ఇచ్చేయాలా అంటూ రాంబాబు కామెంట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోను టీడీపీ వర్గాలు వైరల్ చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: