చైనాకు చిర్రెత్తించేలా ఆమెరికా ఓ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చైనాకు చిరాకు పెట్టిస్తున్న చిన్న దేశం తైవాన్‌కు అమెరికా అండగా నిలుస్తోంది. చైనాతో తైవాన్‌ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా తైవాన్ కు భారీగా రక్షణ సాయం ప్రకటించింది. చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్నానని తైవాన్‌ ఆందోళన పడుతుంటే.. ఆ దేశానికి అమెరికా ఏకంగా 1.1 బిలియన్ డాలర్ల ఆయుధ ప్యాకేజీని ప్రకటించింది.

ఈ సాయంతో తైవాన్ తన రక్షణ సామర్థ్యం పెంచుకునేందుకు అవసరమైన సైనిక సాయం అందనుంది. తైవాన్ రక్షణ బలగాల ఆధునీకరణ, రక్షణ సామర్థ్యాల పెంపు కోసం అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. శత్రు దేశాల క్షిపణులను ట్రాకింగ్ చేసేందుకుగాను....665 మిలియన్ డాలర్ల విలువ చేసే రాడార్ హెచ్చరిక వ్యవస్థను కూడా అమెరికా ఈ ప్యాకేజీలో భాగంగా తైవాన్‌కు అందజేస్తోంది. 355 మిలియన్ డాలర్ల విలువైన 60 అధునాతన హార్పూన్  యాంటీ షిప్ క్షిపణులు కూడా అమెరికా తైవాన్ కు అందిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: