కంచే చేను మేస్తే కాచేదెవరు అని ఓ సామెత.. అన్నమయ్య జిల్లాలో అదే జరిగింది. బ్యాంకుల్లో తాకట్టు పెట్టే బంగారాన్ని చెక్ చేయాల్సిన వాడే నకిలీ బంగారం పెట్టి కోట్లు కొట్టేశాడు. నకిలీ బంగారం తాకట్టు పెట్టి కోటిన్నర డబ్బులు కాజేసిన శేఖరా చారి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెనగలూరు మండలం ఓబిలి ఎస్బిఐ బ్రాంచ్ లో శేఖర ఆచారి అప్రైజర్ గా పనిచేస్తున్నాడు. తాను, తన భార్య పేరిట నకిలీ బంగారం తాకట్టు పెట్టి  శేఖర ఆచారి  తొమ్మిది లోన్లు తీసుకున్నాడు.

అంతే కాదు.. తనకు తెలిసిన వ్యక్తుల చేత నకిలీ బంగారం తాకట్టు పెట్టించి శేఖర ఆచారి  మరో 21 లోన్లు తీసుకున్నాడు. నకిలీ బంగారంతో మొత్తం 30 లోన్లు తీసుకుని కోటిన్నర రూపాయల కాజేసినట్లు పోలీసుల విచారణ వెల్లడైంది. పోలీసులు బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి 8 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: