విజయవాడలో భారీ మల్టీలెవల్ చీటింగ్ వెలుగు చూసింది. సంకల్ప్ సిద్ధి ఈకార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్  పేరుతో గొలుసు కట్టు విధానంలో మోసానికి పాల్పడింది. కోట్ల రూపాయల స్కాం తాజాగా బయట పడింది. ఈ సంస్థ  బంగారం, ఎర్రచందనం, షేర్స్ ట్రేడింగ్ , క్రిప్టో కరెన్సీ పేరుతో ప్రాజెక్టులు ప్రారంభించి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. రూ. లక్ష పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే 3 లక్షల వరకూ వస్తాయని ప్రచారం చేసినట్టు తెలిసింది.


బోనస్లు, లక్షల రూపాయలు నగదు వస్తుందని ఈ సంస్థ ప్రతినిధులు ఎర వేశారు . వెయ్యి రూపాయల నిత్యావసర సరుకులు కొనుగోలు చేస్తే 40 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇస్తామంటూ వీరు పబ్లిసిటీ ఇస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు . కంపెనీకి చెందిన ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: